అన్వేషించండి

Reduce Stress Quickly : ఒత్తిడి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుందా? క్షణాల్లో మనసుకు ప్రశాంతతను ఇచ్చే 5 టెక్నిక్స్ ఇవే

Simple Breathing Exercises : ఒత్తిడి, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడం చాలా కష్టం. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ టెక్నిక్స్​ ఫాలో అవ్వండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కొన్ని శ్వాస వ్యాయామాలు.
  • డీప్ బ్రీతింగ్, బాక్స్ బ్రీతింగ్ ఒత్తిడిని తగ్గిస్తాయి.
  • ఆల్టర్నేట్ నాస్ట్రిల్, 4-7-8 పద్ధతులు ప్రశాంతతను ఇస్తాయి.
  • బెల్లీ బ్రీతింగ్, శ్వాస నియంత్రణను మెరుగుపరుస్తుంది.

Powerful Breathing Techniques For Stress Relief : రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ చాలా సాధారణమైపోయాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల చాలామంది డిస్టర్బ్​గా ఫీల్ అవుతున్నారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉండడం కష్టమవుతోంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో కొన్ని సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​ చేయాల్సి ఉంటుంది. అవేంటో వాటి వల్ల కలిగే లాభాలు.. ఎలా చేస్తే మంచిదో చూసేద్దాం. 

మీరు యాంగ్జైటీ, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా? అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే రిలాక్స్‌గా ఫీల్ అయ్యే బ్రీతింగ్ వ్యాయామాలు ఇక్కడ ఉన్నాయి. శ్వాసను సరైన విధంగా నియంత్రించడం వల్ల మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ చేరి ఒత్తిడి తగ్గడంలో సహాయపడుతుంది. వెంటనే రిలాక్స్ చేసే 5 ఈజీ బ్రెతింగ్ ఎక్సర్‌సైజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డీప్ బ్రీతింగ్ 

డీప్ బ్రీతింగ్ అనేది చాలా సులభమైన విషయం కానీ.. చాలా ప్రభావవంతమైన శ్వాస వ్యాయామం. ముందుగా సౌకర్యంగా కూర్చొని ముక్కు ద్వారా నెమ్మదిగా లోపలికి గాలి పీల్చాలి. ఆ తర్వాత కొన్ని సెకన్లు ఆపి నోటి ద్వారా మెల్లగా బయటకు వదలాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేస్తే గుండె వేగం క్రమంగా తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.

బాక్స్ బ్రీతింగ్ 

ఈ టెక్నిక్‌ను చాలా మంది మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగిస్తారు. నాలుగు సెకన్లు శ్వాస లోపలికి పీల్చాలి. తర్వాత నాలుగు సెకన్లు ఆపాలి. మళ్లీ నాలుగు సెకన్లు శ్వాస బయటకు వదలాలి. మళ్లీ నాలుగు సెకన్లు ఆపాలి. ఈ సైకిల్‌ను కొన్ని నిమిషాలు కొనసాగిస్తే టెన్షన్ తగ్గి ఫోకస్ పెరుగుతుంది.

ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్    

యోగాలో చాలా ప్రసిద్ధి చెందిన ఈ శ్వాస విధానం మనసుకు బ్యాలెన్స్ ఇవ్వడంలో సహాయపడుతుంది. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి మరో వైపు నుంచి గాలి పీల్చాలి. తర్వాత వైపు మార్చి బయటకు వదలాలి. ఇలా కొన్ని నిమిషాలు చేస్తే ఆందోళన తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది.

4-7-8 బ్రీతింగ్ టెక్నిక్

ఈ టెక్నిక్ నిద్రలేమి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ముందుగా నాలుగు సెకన్లు గాలి పీల్చాలి. తర్వాత ఏడు సెకన్లు శ్వాసను ఆపాలి. ఆ తర్వాత ఎనిమిది సెకన్లు మెల్లగా గాలి బయటకు వదలాలి. ఈ పద్ధతిని రోజూ కొన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తే మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. 

బెల్లీ బ్రీతింగ్ 

ఈ వ్యాయామంలో ఛాతీ కాకుండా పొట్ట భాగం కదలేలా శ్వాస తీసుకోవాలి. ఒక చేయిని ఛాతీపై మరో చేయిని పొట్టపై పెట్టుకుని నెమ్మదిగా లోపలికి గాలి పీల్చాలి. ఇలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గి శ్వాస నియంత్రణ మెరుగుపడుతుంది.

ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేయడానికి ప్రత్యేక పరికరాలు ఏమి అవసరం లేదు. రోజుకు కేవలం 5 నుంచి 10 నిమిషాలు కేటాయించినా సరిపోతుంది. రెగ్యులర్‌గా ఈ పద్ధతులను పాటిస్తే ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కూడా మెరుగుపడతాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget