అన్వేషించండి

Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్

Weekend Detox Drinks : వీకెండ్ సమయంలో శరీరాన్ని రీసెట్ చేసుకుని.. రిఫ్రెష్ ఫీల్ కోసం కొన్ని డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఈ సహజమైన డ్రింక్స్ ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పని ఒత్తిడి, ఆహారంతో అలసిన శరీరానికి డిటాక్స్ పానీయాలు మేలు.
  • నిమ్మ, పుదీనా, అల్లం పానీయాలు జీర్ణక్రియ, రోగనిరోధకతకు తోడ్పడతాయి.
  • పుచ్చకాయ, గ్రీన్ టీ, మజ్జిగతో శరీరం రిఫ్రెష్ అవుతుంది.
  • తగిన నిద్ర, నీరు, వ్యాయామంతో శరీరం రీసెట్ అవుతుంది.

Natural Drinks for Healthy Reset : పనులు, ఒత్తిడి, బయట తీసుకునే ఆహారం వల్ల కొన్నిసార్లు శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని నేచురల్ డ్రింక్స్ తీసుకుంటే శరీరంర రీసెట్ అవుతుందని అంటున్నారు నిపుణులు. కొన్ని సహజమైన డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లే అవకాశముంది. అంతేకాకుండా శరీరాన్ని రిఫ్రెష్ చేస్తాయి. మరి సహజంగా లభించే డీటాక్స్ డ్రింక్స్ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

నిమ్మకాయ, పుదీనా నీరు

ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు వేసి తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మలోని విటమిన్ C రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. పుదీనా మెరుగైన జీర్ణక్రియను అందించడంలో హెల్ప్ చేస్తుంది. 

Also Read : శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలా? బాడీని రీసెట్ చేసే డ్రింక్స్ ఇవే

కొబ్బరి నీరు

సహజమైన ఎలక్ట్రోలైట్స్‌కు కొబ్బరి నీరు మంచి డ్రింక్​గా చెప్పవచ్చు. ఇది శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటానికి, అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. హైడ్రేషన్, రిఫ్రెష్ ఫీల్ కోసం దీనిని తీసుకోవచ్చు. 

కీరదోస, నిమ్మ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్

కీరదోసను ముక్కలుగా కోసి.. నిమ్మను కూడా ముక్కలు చేసి.. వాటిని నీటిలో వేసి రెండు గంటలు అలాగే ఉంచాలి. తర్వాత దీనిని తాగితే రుచిగా ఉండటంతో పాటు శరీరానికి డీప్ హైడ్రేషన్ అందుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది. 

అల్లం, నిమ్మ టీ

గోరువెచ్చని నీటిలో అల్లం ముక్కలు మరిగించి.. కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి. అల్లం జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

Also Read : టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తేమను అందించి తాజాగా అనిపించేలా చేస్తుంది. అదనంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. షుగర్ లేకుండా తాగితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే రోజుకు 2 లేదా 3 కప్పులకు మించకుండా తీసుకోవాలి.

మజ్జిగ

వీకెండ్‌లో తేలికపాటి ఆహారంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర కలిపి తాగితే రుచి, పోషక విలువ రెండూ పెరుగుతాయి.

Also Read : కొవ్వును కరిగించే హెల్తీ డ్రింక్స్.. బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యూలర్​గా తాగొచ్చు

డిటాక్స్ కోసం పాటించాల్సిన చిట్కాలు

మీరు మీ శరీరాన్ని డీటాక్స్ చేసుకోవాలనుకుంటే రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. అలాగే డైట్లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. వేయించిన, ఎక్కువ షుగర్ ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. అలాగే తగినంత నిద్ర కూడా ఆరోగ్యానికి అవసరం. అంతేకాకుండా రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget