అన్వేషించండి

Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు

Leafy Greens Boost Lung Health : డైట్లో ఏదొక పూట భోజనంలో ఆకుకూరలు చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విటమిన్ K1 ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆస్ట్రేలియా పరిశోధనలు వెల్లడించాయి.
  • అధిక విటమిన్ K1 వినియోగం COPD ప్రమాదాన్ని 16% తగ్గించినట్లు కనుగొన్నారు.
  • ధూమపానం చేసేవారిలో K1 ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించి ప్రయోజనం చేకూరుస్తుంది.
  • ఇది పరిశీలనాత్మక అధ్యయనం, మరిన్ని క్లినికల్ పరిశోధనలు అవసరం.

Leafy Greens For Lung Health : ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. దాని ఫలితాల ప్రకారం.. పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ K1 ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించవచ్చని వెల్లడించారు.

ఆకుకూరలు రెగ్యులర్​గా తీసుకున్నప్పుడు శరీరానికి విటమిన్ కె అందుతుంది. అసలు విటమిన్ కె అంటే ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? పరిశోధనలోని ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : స్మోకింగ్ తర్వాత ఊపిరితిత్తులను డీటాక్స్ చేయగలమా? లంగ్స్ హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్

విటమిన్ K

విటమిన్ కె రెండు రకాలుగా ఉంటుంది. అది విటమిన్ K1, విటమిన్ K2. విటమిన్ K1 అనేది పాలకూర, బ్రోకలీ, కాలే, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పులియబెట్టిన ఆహారాలు, గుడ్లు, కొన్ని పాల ఉత్పత్తులు, మాంసాహారంలో విటమిన్ K2 ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.

పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు

ఆస్ట్రేలియాలోని Edith Cowan Universityకి చెందిన శాస్త్రవేత్తలు 1,79,062 మందిపై పరిశోధన చేశారు. వారి నుంచి ఆరోగ్య వివరాలను సేకరించి.. సుమారు పదిన్నర సంవత్సరాల పాటు విశ్లేషించారు. ఈ స్టడీలో వారి ఆహారంలో విటమిన్ K1, K2 మోతాదును పరిశీలించి.. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో సంబంధాన్ని అధ్యయనం చేశారు.

Also Read : ఊపిరితిత్తుల క్యాన్సర్​ లక్షణాలివే.. ముందుగానే గుర్తించి, ప్రాణాలు కాపాడుకోండిలా

విటమిన్ K1 ఎక్కువగా తీసుకునేవారిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో COPD అంటే Chronic Obstructive Pulmonary Disease వచ్చే ప్రమాదం సుమారు 16 శాతం వరకు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. ధూమపానం చేసే వారిలో, అలాగే దుమ్ము, రసాయనాలు వంటి కాలుష్య వాతావరణంలో పనిచేసే ఉద్యోగుల్లో ఈ బెనిఫిట్ స్పష్టంగా కనిపించిందట. 
అయితే విటమిన్ K2 తీసుకోవడం వల్ల COPD ప్రమాదం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆస్తమా విషయంలో కూడా విటమిన్ K1 లేదా K2తో ప్రత్యేక సంబంధం కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.

విటమిన్ K1 వల్ల కలిగే లాభాలు..

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ K1 శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రోటీన్లను సక్రియం చేస్తుంది. ఇవి ఊపిరితిత్తుల కణజాలం సౌకర్యవంతంగా ఉండేందుకు, దెబ్బతినకుండా రక్షించేందుకు సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏదొక సమయంలో ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే విటమిన్ K1 మోతాదును సులభంగా పెంచుకోవచ్చు. 

Also Read : ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఇవే.. శ్వాస సమస్యలకు చెక్ పెట్టండిలా

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే COPD వంటి వ్యాధులను నివారించడానికి కేవలం ఆకుకూరలపై మాత్రమే ఆధారపడకుండా.. ధూమపానాన్ని మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని చెప్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇది కేవలం ఒక పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. అంటే విటమిన్ K1 నేరుగా COPDని నివారిస్తుందని ఈ పరిశోధన నిరూపించలేదు. కానీ విటమిన్ K1 ఎక్కువగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉండవచ్చు. దీనిపై మరిన్ని క్లినికల్ పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget