అన్వేషించండి

30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Benefits of Daily Walking : రోజుకు అరగంట నడక అనేది చిన్న అలవాటుగా అనిపించినా.. ఇది అది శరీరం, మనసుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోజు 30 నిమిషాల నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • బరువు నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.
  • జీర్ణక్రియ మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.
  • ఎముకలు, కండరాలను బలంగా చేసి, మంచి నిద్రకు సహాయపడుతుంది.

Health Benefits of Walking 30 Minutes Daily : ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడవడం ద్వారా కూడా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నడక అనేది అత్యంత సులభమైన, సురక్షితమైన వ్యాయామాల్లో ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు నియంత్రణ, మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి రోజూ 30 నిమిషాలు నడిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం 

రోజూ నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె కండరాలు బలపడతాయి. దీంతో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.

బరువు నియంత్రణ

నడక వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. క్రమం తప్పకుండా నడవడం ద్వారా శరీరంలో అదనపు కొవ్వు తగ్గి బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు 

భోజనం తర్వాత 30 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

మెరుగైన జీర్ణక్రియ 

నడక వల్ల పేగుల కదలికలు చురుకుగా మారి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మానసిక ఒత్తిడి

నడక సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, నిరాశ భావాలను తగ్గించడంలో సహాయపడతాయి.

మెరుగైన నిద్ర 

ప్రతిరోజూ నడిచే వారిలో నిద్ర నాణ్యత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. శారీరక శ్రమ వల్ల శరీరం సహజంగా విశ్రాంతి కోరుతుంది. దీంతో నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉంది. 

కండరాలు, ఎముకలు బలం

నడక కాళ్ల కండరాలను చురుకుగా ఉంచుతుంది. అలాగే ఎముకల సాంద్రతను కాపాడటంలో సహాయపడి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనత ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

రోగనిరోధక శక్తికై

నడక అనేది మితమైన శారీరక వ్యాయామం. ఇది శరీర రక్షణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో సాధారణ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తగ్గవచ్చు.

ఇవేకాకుండా రోజూ నడవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి రోజులో అరగంట నడిస్తే మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నార. 

నడిచేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మీరు ఆరోగ్యంగా ఉండేందుకు డైలీ వాకింగ్ చేయాలనుకుంటే.. సౌకర్యవంతమైన షూస్ వేసుకోవాలి. అలాగే నడకకు ముందు, తర్వాత తగినంత నీరు తాగండి. మొదట్లో నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా వేగాన్ని పెంచండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్త వ్యాయామ ప్రణాళిక ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

హెల్త్, మరిన్ని ఇంటి చిట్కాల కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget