అన్వేషించండి

Obesity Prevention Tips : బరువు పెరిగిపోతున్న పిల్లలు, ఊబకాయ నివారణే మార్గం.. లేకుంటే ముప్పే, డాక్టర్ ముఫ్జల్ సూచనలివే

Obesity : పిల్లల్లో బరువు పెరగడం అనేది కామన్ సమస్యగా మారుతుంది. ఊబకాయం సమస్య రెట్టింపు కాకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Obesity in India Cases : ప్రపంచ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదికల ప్రకారం.. భారతీయుల్లో 135 మిలియన్లకు పైగా భారతీయులు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారట. అయితే పిల్లలపై దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉందనేది మరింత ఆందోళన కలిగిస్తుంది. గత దశాబ్ధంలో ఇండియాలో పిల్లల్లో ఊబకాయం రేటు దాదాపు మూడు రెట్టి పెరిగిందని ఫలితాలు చూపిస్తున్నాయి. ఈ ఊబకాయం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డైజెస్టివ్ హెల్త్ ఇన్​స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఫ్జల్ లక్డవాలా.

పిల్లల్లో, యువతలో ఊబకాయ ప్రభావం ఎక్కువగా ఉండడానికి లైఫ్​స్టైల్, తీసుకునే ఆహారం, జెనిటిక్స్ వంటి వివిధ కారణాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ ప్రభావం ఫ్యూచర్​లో మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊబకాయం రాకుండా ఉండేందుకు డాక్టర్ ముఫ్జల్ పలు సూచనలు చేస్తున్నారు. 

ఆరోగ్యకరమైన అలవాట్లు 

పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలని ముఫ్జల్ తెలిపారు. పాఠశాలల్లో పోషకాహార గురించిన పాఠ్యాంశాలు భాగం చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన, తియ్యని పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. ప్యాక్ చేసిన స్నాక్స్ పరిమితంగా తీసుకోకుంటే వచ్చే ఇబ్బందులు గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. 

పిల్లలకు పండ్లు, హెల్తీ ఫుడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చదువుతో పాటు శారీరక విద్య, క్రీడలు తప్పకుండా ఆడేలా చూడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పిల్లలకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి. విద్యార్థులను పాఠశాలకు నడిచి లేదా సైకిల్ మీద వెళ్లేలా ప్రోత్సహించాలి. క్రమం తప్పకుండా నీటిని తీసుకునేవిధంగా పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ సహకరించాలని తెలిపారు. 

కుటుంబంలో చేయాల్సిన మార్పులు

చిన్న వయస్సు నుంచే పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేందుకు తల్లిదండ్రులు కృషిచేయాలి. పిల్లలపై ఒత్తిడి పెంచడం సరికాదు. అలాగే సమతుల్య ఆహారం పిల్లలకు అందించాలి. స్వీట్స్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు పిల్లలకు అవగాహన కల్పించాలి. బలవంతం చేస్తే మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని పడుతుంది.

పిల్లలను స్కూల్​తో పాటు యోగా తరగతులు, వాకింగ్ క్లబ్‌లు లేదా ఇంటరాక్టివ్ వెల్‌నెస్ సెమినార్ల వంటి కమ్యూనిటీ స్థాయిలో యాక్టివ్​గా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిలో పాల్గొంటే ఊబకాయ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయి. 

ఉద్యోగం చేసేవారైతే.. 

డెస్క్ జాబ్​లు చేసేవారు వార్షికంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్​నెస్ వివరాలు, ఉద్యోగుల మానసిక పరిస్థితిపై యాజమాన్యం శ్రద్ధ చూపించాలి. ఉద్యోగుల మానసిక ప్రశాంతతకు సంబంధించిన వాతావరణ కల్పించాలి. స్పోర్ట్స్ క్లబ్స్​, వెల్​నెస్ ఛాలెంజ్​లు చేయిస్తే వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఊబకాయం రావడానికి ఒత్తిడి ఓ ప్రధాన కారణం. కాబట్టి దానిని ఉద్యోగులపై పడకుండా చూసుకోవాలి. 

జాతీయ స్థాయిలో రావాల్సిన మార్పులు

ఊబకాయం పెరగకుండా చూడాలంటే.. షుగర్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలపై పన్ను విధించడంతో పాటు ప్యాకేజీ ముందు భాగంలో స్పష్టంగా పోషకాహార లేబులింగ్ ఉండేలా చూసుకోవాలి. స్థానికంగా పండించిన తాజా ఉత్పత్తులకు, హెల్తీ ఫుడ్స్​కు ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. వ్యాయామాన్ని ప్రోత్సాహించే కార్యక్రమాలను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. 

బారియాట్రిక్ సర్జరీ ద్వారా ఊబకాయంతో ఇబ్బంది పడేవారి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దాని తర్వాత జీవనశైలి మారాల్సి ఉంటుంది. అందుకే చికిత్సకంటే రాకుండా నివారించడమే ముఖ్యమంటున్నారు ముఫ్జల్. 

గ్లోబల్ హెల్త్ ఎకనామిక్ అధ్యయనాల ప్రకారం.. నివారణ ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేసిన ప్రతి రూపాయి.. కాలక్రమేణా చికిత్స ఖర్చులలో పది శాతం వరకు ఆదా చేస్తుందని తెలిపింది. ఇప్పుడు నివారణ చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో దానికి రెట్టింపు అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget