యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటో చూసేద్దాం.

యాపిల్స్​లో సహజమైన షుగర్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

ముఖ్యంగా యాపిల్స్​ని జ్యూస్​ రూపంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

యాపిల్​లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు.

ఎక్కువ తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, క్రాంప్స్, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు.

క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడిన యాపిల్స్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

యాపిల్ తిన్న వెంటనే నోటిని కడుక్కోవాలని లేదంటే పంటి సమస్యలు వచ్చే అవకాశముందని చెప్తున్నారు.

కొందరికి యాపిల్స్ అలెర్జీని ఇస్తాయి. మీకు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటే తినకపోవడమే మంచిది.

యాపిల్​లో తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగేలా చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. లిమిటెడ్​గా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.