అన్వేషించండి

Belly Fat Burning : ఇంట్లో ఉండి పొట్ట తగ్గించుకోవడం ఎలా? ఈ సింపుల్ వ్యాయామంతో బెల్లీ ఫ్యాట్ మాయం

Belly Fat Reduction : ఓ సింపుల్ వ్యాయామం పొట్ట కొవ్వును తగ్గించడమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసా? ఇంతకీ ఆ ఆసనం ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Belly Fat Burning Exercise : నేటి బిజీ లైఫ్‌స్టైల్, క్రమరహితంగా తీసుకునే ఆహారం, స్ట్రెస్ వంటి వాటివల్ల పొట్ట పెరగడం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మగవారే కాదు ఆడవారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దానిని తగ్గించుకునేందుకు చాలామంది జిమ్‌కు వెళ్లాలనుకుంటారు కానీ.. సమయం లేకపోవడం, డబ్బులు సరిపోవు అనే ఇబ్బందులతో వెళ్లలేరు. అలాంటివారు ఇంట్లోనే కూర్చొని చేయగలిగే ఒక ప్రభావవంతమైన వ్యాయామం ఉంది. అదే కపాలభాతి (Kapalbhati)ప్రాణాయామం. ఇది పొట్ట కొవ్వును తగ్గించడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

డాక్టర్ శివ కుమార్ మాట్లాడుతూ.. "కపాలభాతి అనేది ఒక వ్యాయామం. దీనిని చేయడం ద్వారా మొత్తం శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలాగే మీ పొట్ట కూడా తగ్గుతుంది. సులభంగా దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే.. కూర్చోనే చేయగలిగే ఎఫెక్టివ్ ఆసనం ఇది" అని తెలిపారు. మరి కపాలభాతి పొట్టను ఎలా తగ్గిస్తుంది? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? దీనిని ఎలా చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కపాలభాతి పొట్ట కొవ్వును ఎలా తగ్గిస్తుందంటే..

  • రోజూ కపాలభాతి ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే.. పొట్ట కండరాలు సక్రియం అవుతాయి.
  • ప్రతిసారీ గట్టిగా గాలిని వదిలినప్పుడు.. అది పొట్ట లోపలి భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అక్కడ పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది.
  • ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీనివల్ల క్యాలరీలు కూడా వేగంగా బర్న్ అవుతాయి. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. 
  • పొట్ట చుట్టూ ఉండే గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీనివల్ల పొట్ట లోపలికి వెళ్తుంది.

కపాలభాతిని ఎలా చేయాలి

  • కపాలభాతిని చేసేందుకు శుభ్రమైన ప్రదేశం ఎంచుకోవాలి. అక్కడ సుఖాసన లేదా పద్మాసనంలో కూర్చోవాలి.
  • ఇప్పుడు వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్లు మూసుకోవాలి.
  • శ్వాస తీసుకోండి. ఆపై ముక్కు ద్వారా గాలిని వేగంగా వదలండి.
  • గాలిని వదిలేటప్పుడు పొట్టను లోపలికి లాగండి.
  • ఈ ప్రక్రియను నిరంతరం చేయండి. 2 నిమిషాల నుంచి ప్రారంభించి దీనిని నెమ్మదిగా 15 నిమిషాల వరకు పెంచవచ్చు. 

కపాలభాతితో కలిగే ఇతర ప్రయోజనాలు

  • మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
  • ముఖానికి మెరుపును తెస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
  • పొట్టలో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

పొట్ట పెరగకూడదని భావించేవారు.. చురుకుగా, ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారు కచ్చితంగా ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని మీ రొటీన్​లో భాగం చేసుకోండి. కేవలం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తే పొట్టతగ్గడమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ సింపుల్ ఆసనం ఎవరైనా చేయవచ్చు. ప్రెగ్నెన్సీతో ఉండేవారు మాత్రం నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Why Clouds Float: లక్షల కిలోల బరువు ఉండే మేఘాలు ఆకాశంలో ఎలా తేలుతాయి? వెనుక ఉన్న సైన్స్ ఇదే! 
100 ఏనుగుల బరువు, అయినా కింద పడవు! మేఘాల వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ మీకు తెలుసా? 
Embed widget