అన్వేషించండి

World Lung Cancer Day 2025 : ఊపిరితిత్తుల క్యాన్సర్​ లక్షణాలివే.. ముందుగానే గుర్తించి, ప్రాణాలు కాపాడుకోండిలా

World Lung Cancer Day : ఊపిరితిత్తుల ఆరోగ్యంపై, క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ.. ఏటా ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూసేద్దాం. 

World Lung Cancer Day 2025 : క్యాన్సర్ మరణాలకు ప్రధానంగా కారణమవుతోన్న ఊపిరితిత్తుల క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఏడాది ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్​ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ రాకుండా ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి.. వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్స విధానం ఏంటి వంటి విషయాలు తెలుసుకుందాం. 

ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ చరిత్ర 

ఊపిరితిత్తుల క్యాన్సర్​పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్​ డేని 2012లో ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (Forum of International Respiratory Societies), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్​ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అవగాహన కల్పిస్తున్నాయి. లంగ్ క్యాన్సర్​ ముందుగానే గుర్తిస్తే.. దానికి సరైన జాగ్రత్తలు తీసుకుని.. హెల్తీగా ఉండవచ్చు. 

ప్రపంచం వ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఊపిరితిత్తులే ప్రధానకారణంగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ సమస్యపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిని ముందస్తుగా గుర్తించడం నుంచి.. వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలవరకు ఏమి ఫాలో అవ్వాలి. ముందుగా గుర్తిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానం వంటి అంశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఊపిరితిత్తుల క్యాన్సర్  ప్రాణాంతకమా?

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణాలలో ఒకటి. రోజురోజుకి మరణాలు ఎక్కువ అవుతున్నాయని గుర్తించారు. ఇది అధునాతన దశకు చేరుకునే వరకు దానిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ధూమపానం చేసేవారిని, ధూమపానం చేయనివారిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ ధూమపానం ప్రమాదాకరంగా చెప్తారు. లంగ్ క్యాన్సర్ అనేది స్మోక్ చేసేవారిని, చేయని వారిని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ముందస్తు స్టేజ్​లో దీనిని గుర్తించకపోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారవచ్చు. సిగరెట్ అనేది దీని ప్రమాదం మరింత పెంచుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే స్మోకింగ్ మానేయడం. అలాగే సెకండ్ స్మోకింగ్​కి కూడా దూరంగా ఉండాలి. కాలుష్య సంబంధిత ప్రాంతాల్లో తిరగడం తగ్గించాలి. హాని చేసే కెమికల్స్ ఉండే ప్రాంతంలో మాస్క్ వేసుకుని తిరగాలి. 

ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కణాల దెబ్బతినకుండా కాపాడుకోవడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. 

లంగ్ క్యాన్సర్ లక్షణాలు

ఊపిరితిత్తుల క్యాన్సర్​ సమయంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు రావడం, ఛాతిలో నొప్పి రావడం, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు.. అనుకోకుండా బరువు తగ్గిపోవడం, ఫటిగో వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే సమస్య ఉన్నా లేకున్నా.. రెగ్యులర్​గా స్క్రీనింగ్స్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్​ని ముందుగా గుర్తించి.. దానికి తగిన చికిత్స అందించే వీలు ఉంటుంది. ఎంత త్వరగా సమస్యను గుర్తిస్తే.. అంత ప్రమాదం తగ్గుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget