అన్వేషించండి

Fat Burning Drinks : కొవ్వును కరిగించే హెల్తీ డ్రింక్స్.. బరువును తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యూలర్​గా తాగొచ్చు

Weight Loss Drinks : కొన్ని డ్రింక్స్, హెర్బల్ డ్రింక్స్​ని డైట్​లో చేర్చుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేయవచ్చట. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి?

Drinks to Lose Weight : కరెక్ట్​గా ప్లాన్ చేసుకోవాలే కానీ.. కొన్ని డ్రింక్స్​తో కూడా శరీరంలోని కొలెస్ట్రాల్​ని తగ్గించుకోవచ్చు. మీ లైఫ్​ స్టైల్​కి తగ్గట్లు కొన్ని పానీయాలను డైట్​లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చాలామంది కొలెస్ట్రాల్​ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా దీనివల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్​లతో నిండిన గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్​ను బర్న్​ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని మీ డైట్​లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయంటున్నారు. 

బ్లాక్​ కాఫీ

కెఫిన్ అనేది శరీరంలో జీవక్రియను పెంచుతుంది. మెటబాలీజం ఎంత ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు అంత వేగంగా కరుగుతుంది. దానిని ఎనర్జీగా మారస్తుంది. అందుకే బ్లాక్​ కాఫీని రోజులో ఓసారైనా తాగాలి అంటారు. ఫ్యాట్​ని తగ్గిస్తుంది కదా అని దీనిని ఎక్కువగా తాగితే మంచి బెనిఫిట్స్.. చెడు ప్రయోజనాలే ఎక్కువ అవుతాయి. 

అల్లం టీ

మీకు ఉదయాన్నే టీ తాగాలనుకున్నప్పుడు లేదా డేలో ఎప్పుడైనా టీ తాగాలనుకుంటే అల్లంటీ తీసుకోవచ్చు. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించి.. మెటబాలీజంని పెంచుతుంది. హెర్బల్ టీగా కాకున్నా.. రెగ్యూలర్​గా టీలో కూడా దీనిని వేసుకోవచ్చు. 

పసుపు పాలు 

పాలల్లో పసుపు కలిపి తాగితే సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. మంచి నిద్ర వస్తుంది. వీటితో పాటు ఇది శరీరంలోని కొవ్వును కూడా సమర్థవంతంగా కరిగిస్తుంది. 

దాల్చిన చెక్క టీ..

మధుమేహం ఉండి.. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్​ని కంట్రోల చేస్తుంది. దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే జీవక్రియ కూడా మెరుగవుతుంది. 

లెమన్ వాటర్.. 

గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండి.. రెగ్యూలర్​గా తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్​ బయటకవు వస్తాయి. మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల కొలెస్ట్రాల్​ అదుపులోకి వస్తుంది. 

కీరదోస లైమ్ వాటర్.. 

కీర దోస మిమ్మల్ని హైడ్రేట్ చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో పుదీనా ఆకులు కూడా వేసి.. నిమ్మకాయ పిండి.. రెగ్యూలర్​గా తాగవచ్చు. 

క్రాన్బెర్రీ జ్యూస్.. 

పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించడంలో క్రాన్బెర్రీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మెరుగైన జీవక్రియను అందించి.. కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తుంది. 

గ్రీన్ స్మూతీ

ఉదయాన్నే బచ్చలికూర, అవకాడో, అరటిపండువాటిని స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. వీటిలో పోషకాలు, ఫైబర్ కొలెస్ట్రాల్​ని కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. 

హెర్బల్ టీలు

పుదీనా ఆకులతో చేసిన టీ జీర్ణక్రియను ప్రోత్సాహిస్తుంది. జీవక్రియను పెంచి కొలెస్ట్రాల్​ని కరిగిస్తుంది. చమోమిలీ టీ ఒత్తిడిని తగ్గించి నిద్రను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా కొవ్వును తగ్గించి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మందార టీ పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది బరువు తగ్గేలా చూస్తుంది. వీటిని రెగ్యూలర్​గా డైట్​లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్, బ్లాక్ పెప్పర్, సిట్రస్ ఫ్రూట్స్, కొబ్బరి కూడా కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. 

అయితే ఈ డ్రింక్స్ కొవ్వును కరిగించడంలో హెల్ప్ మాత్రమే చేస్తాయి. పూర్తి రిజల్ట్స్ రావాలంటే ఫిజికల్ స్ట్రైంత్ కూడా ముఖ్యమే. నిపుణులు, వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ మొదలుపెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. అలాగే అన్ని డ్రింక్స్ తాగేసి కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుందని అనుకోకూడదని చెప్తున్నారు నిపుణులు.

Also Read : పెళ్లికాకుండానే ఎగ్​ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్​గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Embed widget