Egg Freezing : పెళ్లికాకుండానే ఎగ్‌ఫ్రీజింగ్ చేసుకోవచ్చా? బెనిఫిట్స్ ఏంటి? దీంతో ఎంత లేట్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు?
Egg Freezing Benefits : ఎగ్ ఫ్రీజింగ్ పెళ్లికాకుండానే చేయవచ్చా? ఏ వయసులో దీనిని స్టోర్ చేసుకోవచ్చు? ఎన్ని సంవత్సరాల వరకు దీనిని ఫ్రీజ్ చేయవచ్చు? అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి?
Understanding Egg Freezing : ఈ మధ్యకాలంలో ఎగ్ ఫ్రీజింగ్(Egg Freezing) అనే వర్డ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది. సెలబ్రెటీలు ఈ ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతుండడంతో దీని గురించి తెలుసుకోవాలన్నా క్యూరియాసిటీ ప్రజల్లో పెరుగుతుంది. అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ని పెళ్లికాకముందే చేసుకోవచ్చా? దీనివల్ల ఉపయోగమేమిటి? ఏ వయసు వరకు ఈ తరహా ఎగ్ ఫ్రీజింగ్ని చేసుకోవచ్చు? దీనికి ఎక్స్‌పైయిరీ డేట్ ఏమైనా ఉంటుందా? అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రీజింగ్ అంటే..
ఎగ్ ఫ్రీజింగ్ని ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ (oocyte cryopreservation) అని కూడా అంటారు. అంటే ఫ్యూచర్కోసం మహిళలు తమ ఎగ్‌ని ఫ్రీజ్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీని వయసులో ఉన్నప్పుడు కాకుండా.. కాస్త లేట్‌గా ప్లాన్ చేసుకోవాలనుకునేవారికోసం ఈ ప్రక్రియ ఉంది. దీనిని ఎందుకు చేస్తారంటే.. 30 దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. కానీ ఎర్లీ 30లలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. అందుకే 30 కంటే ముందే క్వాలిటీ ఎగ్‌ను ప్రిజర్వ్ చేసుకుంటారు. దీనిని ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకోసం వాడుకుంటారు. లేట్ 30, 40 ఏళ్లలో ఈ ఎగ్‌ని వాడుకోవచ్చు.
ఏ వయసులో..
ఎగ్ ఫ్రీజింగ్ని లేట్ 20 ఏళ్ల నుంచి ఎర్లీ 30లలో చేసుకోవచ్చు. ఈ సమయంలో ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి డాక్టర్లు అప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలని సూచిస్తారు. అయితే ఈ ఎగ్‌ని పదేళ్లు వరకు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు 29లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే.. దానిని మీరు 39 వరకు స్టోర్ చేసుకుని.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి లీగల్ ఏజ్ 21. పెళ్లి అయినా కాకున్నా.. 21 ఏళ్ల తర్వాత ఏ మహిళ అయినా తన ఎగ్‌ని ఫ్రీజ్ చేసుకోవచ్చు.
ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఇదే..
ఎగ్ ఫ్రీజింగ్ అనేది స్టిమ్యూలేషన్ (Ovarian Stimulation) చేసి.. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. పది నుంచి పన్నెండు రోజులు ప్రాసెస్‌కి సంబంధించిన ఇంజెక్షన్స్‌ని కడుపు దగ్గర చేస్తారు. ఈ ప్రక్రియలో ఎగ్లో పెరుగుదల ఉంటుంది. అలా డెవలప్ అయిన ఎగ్‌ని శస్త్రచికిత్స ద్వారా రిట్రైవ్ (Egg Retrieval) చేసి ఫ్రీజ్ చేస్తారు. ఈ ప్రక్రియను ఓక్టే విట్రిఫికేషన్ (vitrification) అంటారు. రాపిడ్ ఫ్రీజింగ్ అని కూడా అంటారు. ఈ ఎగ్స్‌ని క్రయోబ్యాంక్‌లో స్టోర్ చేస్తారు. దీనిని పదేళ్లవరకు ఉపయోగించుకోవచ్చని.. ఎలాంటి క్రోమోజోమ్‌లు ఎఫెక్ట్ దీనిపై ఉండదని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. దీని సక్సెస్ రేటు (Egg Survival Rate) 90 నుంచి 95 శాతముంటుంది.
ఎవరు చేయించుకుంటారంటే..
వయసురీత్యా సంతానోత్పత్తి క్షీణత ఉన్నవారు.. క్యాన్సర్ చికిత్స చేయించుకునేవారు, సంతానోత్పత్తిని ప్రభావితం చేసే మెడికల్ సమస్యలు, కెరీర్లో ముందుకు వెళ్లాలనుకునేవారు ఇలా వివిధ కారణాలతో చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్, మెహ్రీన్ వంటి హీరోయిన్స్ తమ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకున్నట్లు బహిరంగాగానే చెప్పారు. మరికొందరు వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో కూడా ఈ ప్రక్రియను ఫాలో అవుతున్నారు.
Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట