అన్వేషించండి

Homemade Detox Drinks : శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలా? బాడీని రీసెట్ చేసే డ్రింక్స్ ఇవే

Detox Drinks : శరీరాన్ని అప్పుడప్పుడు డీటాక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరంలో టాక్సిన్లు పేరుకుపోకుండా ఉంటాయి. బాడీని డీటాక్స్ చేసే హెల్తీ డ్రింక్స్ ఏంటో.. వాటి లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Homemade Detox Drinks for Health : శరీరాన్ని డీటాక్స్ చేసి.. లోపల పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిర్వీషీకరణ చేయకుంటే వ్యర్థాలు లోపల పేరుకుపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువ టాక్సిన్లు బ్యాడ్ కొలెస్ట్రాల్​గా మారి.. అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. జీర్ణ సమస్యలను పెంచుతాయి. కాబట్టి పేరుకుపోయిన టాక్సిన్‌లను బయటకు పంపడం చాలా ముఖ్యం. ఇలా రెగ్యులర్​గా చేయడం వల్ల టాక్సిన్లు బయటకుపోవడమే కాకుండా.. జీర్ణక్రియ మెరుగవుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. 

మీరు కూడా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని డీటాక్స్ డ్రింక్​లు ట్రై చేయవచ్చు. పోషకాలతో నిండిన నిర్విషీకరణ పానీయాల తాగడం వల్ల వ్యర్థాలు బయటకు పోయి.. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి మీ సిస్టమ్‌ను సహజంగా శుభ్రపరిచే, దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే డ్రింక్ ఏంటో.. వాటి ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

నిమ్మకాయ, అల్లంతో

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

అల్లం నీటిలో వేసి మరిగించి.. దానిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే చాలా మంచిది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పురాతనమైన డ్రింక్. నిమ్మకాయ పుల్లని, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తుంది. అల్లం ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మంటను తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. కాలేయ పనితీరుకు మద్ధతు ఇస్తుంది. శరీరాన్ని సహజంగా శుభ్రపరిచే ప్రక్రియలను ప్రేరేపిస్తుంది.

ఈ డ్రింక్​ని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం పోషకాలను గ్రహిస్తుంది. తేలికపాటి శక్తిని అందిస్తుంది. ఎక్కువ స్వీట్లు, వేయించిన ఆహారాలు తీసుకునేవారు దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది లోపలి నుంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేసి.. టాక్సిన్ ఫ్రీ చేస్తుంది.

పసుపు, తేనెతో..

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. గోరువెచ్చని పసుపు నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ డీటాక్స్ డ్రింక్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.టాక్సిన్స్ తగ్గించి హెల్తీ స్కిన్ అందిస్తుంది. ఈ డ్రింక్​లో చిటికెడు నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చు. శరీరాన్ని టాక్సిన్స్ ఫ్రీగా చేసి.. శక్తివంతంగా రీసెట్‌ చేసుకోవడం కోసం దీనిని తాగవచ్చు.

పుదీనా. కీర దోసకాయతో..

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

పుదీనా, కీర దోసకాయతో ఇన్​ఫ్యూజ్ చేసిన నీరు శరీరాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. టాక్సిన్లను బయటకు పంపి రిఫ్రెష్ చేస్తుంది. కీరదోసకాయ యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చల్లటి నీటిలో కీరదోసకాయ, తాజా పుదీనా ఆకులను వేసి కొన్ని గంటలు ఉంచండి. రాత్రి నానబెట్టి ఉదయం తాగితే మరీ మంచిది. ఇది మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇచ్చి.. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఉదయం లేదా భోజనాలకు మధ్య ఒక గ్లాసు పుదీనా, కీర దోసకాయ నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. 

గ్రీన్ టీ సహజమైన క్లెన్సర్

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

గ్రీన్ టీ శరీరంలోని టాక్సిన్లను నిర్విషీకరణ చేసి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్​లను కలిగి ఉండే గ్రీన్​ టీని నిమ్మతో కలిపి తీసుకుంటే దాని శుభ్రపరిచే ప్రభావం పెరుగుతుంది. ఆ సమయంలో ఇది యాంటీఆక్సిడెంట్-రిచ్ పానీయంగా మారి.. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో, కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. 

ఆపిల్, దాల్చిన చెక్కతో

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

ఆపిల్, దాల్చిన చెక్క కలిపి జీర్ణక్రియకు సహాయపడి, ఉబ్బరాన్ని తగ్గించి, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తాయి. తాజా ఆపిల్​ను ముక్కలు చేసి.. వాటిని నీటిలో వేసి.. దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. ఈ పానీయంలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయ నిర్విషీకరణకు మద్దతు ఇస్తాయి. ఆరోగ్యకరమైన పేగులను ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

ఇవేకాకుండా కలబంద గుజ్జు, నిమ్మకాయ రసం కూడా శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తినివ్వడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. చేదుగా ఉంటుంది అనుకునేవారు.. కొబ్బరి నీళ్లల్లో కాస్త నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఇది ఎలక్ట్రోలైట్స్ పెంచి.. జీర్ణక్రియకు మద్ధతు ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచి.. టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. సోంపు, ధనియాలు నీటిలో వేసి మరిగించి కూడా తాగవచ్చు. ఇది కాలేయ పనితీరు మెరుగుపరిచి.. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. టాక్సిన్లు బయటకు పంపి.. ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Embed widget