శరీరాన్ని డీటాక్స్ చేసే డ్రింక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/mycleanseplans

పసుపు పాలు

శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు పసుపు కలిపిన పాలు తాగితే మంచిది. వెచ్చని పాలల్లో కాస్త పసుపు వేసి తాగితే శరీరం డీటాక్స్ అవుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను శాంతపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: Pinterest/NadiasRecipes

ఆరెంజ్ జ్యూస్

తాజా నారింజ రసం విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Image Source: Pinterest/soffamagazine

బ్లూ బెర్రీ స్మూతీ

బ్లూ బెర్రీ స్మూతీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి కూడా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలోని డీటాక్స్ లక్షణాలు శ్వాస వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

Image Source: Pinterest/zmansaray

లైకోరైస్ టీ

లైకోరైస్ రూట్ టీ శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఆయుర్వేదంలో దీనిని మంచి ఉపశమనంగా చెప్తున్నారు. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. ఇది హెల్తీ బ్రీత్ని ప్రోత్సాహిస్తుంది.

Image Source: Pinterest/eatthisnotthat

ABC జ్యూస్

ఏబీసీ జ్యూస్ ఆపిల్స్, బీట్రూట్, క్యారెట్లతో తయారు చేసిన జ్యూస్ తాగితే శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. మొత్తం శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Image Source: Pinterest/feminahu

నిమ్మకాయ, అల్లం, పుదీనా టీ

నిమ్మకాయ, అల్లం, పుదీనా టీ ఒక రిఫ్రెషింగ్ టీగా చెప్పవచ్చు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: Pinterest/etsy

పసుపు అల్లం టీ

పసుపు అల్లం టీ.. పసుపు, అల్లంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి సహజంగా ఊపిరితిత్తుల సమస్య నుంచి ఉపశమనం ఇస్తాయి. శ్వాసను మెరుగుపరుస్తాయి.

Image Source: Pinterest/organicfacts

ఎలక్ట్రోలైట్ డ్రింక్స్

ఎలక్ట్రోలైట్ డ్రింక్స్లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించి ఊపిరితిత్తులను డీటాక్స్ చేస్తాయి. శ్లేష్మాన్ని తొలగించి శ్వాస సమస్యలను దూరం చేస్తాయి.

Image Source: Pinterest/vitacost

పాలకూర జ్యూస్

పాలకూర రసం పోషకాలతో నిండి ఉంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మెరుగైన శ్వాసను అందిస్తాయి.

Image Source: Pinterest/archanaskitchen