అల్లం ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

హెల్తీ ఫుడ్

టీ నుంచి కూరల వరకు అల్లాన్ని చాలామంది ఉపయోగిస్తారు. ప్రతి వంటింట్లో దాదాపు ఉంటుంది. ఇది రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Image Source: pexels

ఆయుర్వేదంలో..

ఆయుర్వేదం అల్లంను జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడే లక్షణాలు కలిగిన శక్తివంతమైన మూలికగా వర్ణిస్తుంది.

Image Source: pexels

అలా తీసుకుంటే హానికరం

ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి హాని కలిగించే దుష్ప్రభావాలు కలుగుతాయి.

Image Source: Canva

కడుపులో మంట

అధికంగా అల్లం తీసుకోవడం వల్ల కడుపు పొరకి చికాకు కలిగిస్తుంది. ఎసిడిటీనని పెంచుతుంది. దీని వలన అసౌకర్యం లేదా గుండెల్లో మంట వస్తుంది.

Image Source: pexels

రక్తపోటు, రక్తంలో..

అల్లం అధికంగా తీసుకోవడం వల్ల బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవచ్చు. ఇది కొందరికి ప్రమాదకరంగా మారుతుంది.

Image Source: pexels

అలెర్జీ

కొంతమంది అల్లం ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ వస్తుంది. చర్మంపై చికాకు, ఎరుపు లేదా దురద వంటివి వస్తాయి.

Image Source: pexels

గర్భధారణలో ఉంటే

గర్భిణులు అల్లం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అధికంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో ప్రమాదాలు ఏర్పడవచ్చు.

Image Source: pexels

గొంతులో చికాకు

అల్లం ఎక్కువగా తింటే గొంతులో గరగర, మంట లేదా మంటగా అనిపించవచ్చు.

Image Source: pexels

బ్యాలెన్స్డ్​గా

అల్లం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. కంట్రోల్ తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు.

Image Source: pexels