వారంలో శరీరాన్ని ఇలా డీటాక్స్ చేసేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

జంక్, ఆయిల్ ఫుడ్ వద్దు

అధికంగా బయట లేదా నూనెలో వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల మీ జీర్ణ వ్యవస్థపై భారం పడి టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీనివల్ల అలసట, జీర్ణ సమస్యలు వస్తాయి.

Image Source: pexels

బాడీ డీటాక్స్ టిప్స్

ఒక వారం పాటు శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి శక్తి స్థాయిలను పెంచుకోవడానికి, సహజంగా మంచి జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఒక డీటాక్స్ రొటీన్ ప్రారంభించాల్సి ఉంది.

Image Source: pexels

హైడ్రేషన్ టిప్స్

ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోతాయి. దీనివల్ల మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అవయవాల పనితీరుకు మద్దతు ఇస్తుంది.

Image Source: pexels

గ్రీన్ టీ

గ్రీన్ టీలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తీసేయడానికి, జీవక్రియకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది.

Image Source: pexels

విటమిన్ సి

నారింజ, ఉసిరి, కివీ వంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మీ కాలేయం నుంచి హానికరమైన పదార్ధాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.

Image Source: pexels

ఉప్పు తగ్గించండి

ఉప్పు తగ్గించడం వల్ల శరీరంలో నీరు పేరుకుపోకుండా ఉంటుంది. మీ శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: pexels

షుగర్ కంట్రోల్

అధిక చక్కెర తీసుకోవడం వల్ల డీటాక్స్ నెమ్మదించేలా చేస్తుంది. బదులుగా సహజ స్వీటెనర్లు లేదా తాజా పండ్లను ఎంచుకోండి.

Image Source: pexels

వ్యాయామం

నిత్యం ఉదయం నడక లేదా పరుగు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నిర్విషీకరణను వేగవంతం చేస్తాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: pexels