ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ శక్తివంతంగా, ఆత్మవిశ్వాసంతో మెరిసే మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం ఉండాలని కోరుకుంటారు.
వేలాది రసాయన ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులు తక్షణ మెరుపును ఇస్తాయి అనుకుంటారు. అయితే అవి దీర్ఘకాలిక ప్రభావాలను ఇవ్వవు. పైగా చర్మ సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి.
ఆయుర్వేద నివారణలు మీ చర్మాన్ని పోషించడానికి, దాని సహజమైన మెరుపును తిరిగి అందించడానికి సహాయం చేస్తాయి. కాపాడుకోవడానికి సురక్షితమైన, సమగ్ర మార్గాన్ని అందిస్తాయి.
రోజు ప్రారంభంలో గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో ఒక నిమ్మకాయ ముక్కను వేసుకుని తీసుకోవచ్చు. ఇది విషపదార్థాలను బయటకు పంపుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజూ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మీ ముఖం, శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. లోతైన పోషణను అందిస్తుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ మచ్చలను తగ్గిస్తుంది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజమైన, బంగారు మెరుపును ఇస్తుంది.
మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, నెయ్యి, పప్పులు, మూలికా టీలను చేర్చండి. ఇది మీ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
ఆయుర్వేద పద్ధతులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం మెరుగ్గా, మృదువుగా, సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది.
సౌందర్యం, శ్రేయస్సు కోసం ఈ నివారణలతో పాటు సరైన నిద్ర, తగినంత నీరు, ఒత్తిడి నిర్వహణపై కూడా ఫోకస్ చేయాలి.