అన్వేషించండి

Warning Signs of Heart Attack : ఉదయాన్నే కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. గుండెపోటు హెచ్చరికలు కావచ్చు

Early Morning Warning Signs of Heart Attack : ఉదయం నిద్రలేవగానే కనిపించే కొన్ని లక్షణాలు గుండెపోటుకు ప్రమాద సంకేతాలు అంటున్నారు నిపుణులు. అవేంటో.. వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుండెపోటు ప్రాణాంతకం; ఉదయం కనిపించే లక్షణాలు నిర్లక్ష్యం చేయరాదు.
  • ఛాతి నొప్పి, శ్వాస ఇబ్బంది, చల్లటి చెమటలు ముఖ్య హెచ్చరికలు.
  • అలసట, తలతిరగడం, వికారం వంటివి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Silent Heart Attack Symptoms In The Morning : గుండెపోటు అనేది ఎవరికి, ఎప్పుడు వస్తుందో చెప్పలేని ప్రాణాంతక స్థితి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండె కండరాలకు ఆక్సిజన్ అందక హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ సమయంలో సరైన చికిత్స అందకపోతే గుండెకు శాశ్వత నష్టం కలగడంతో పాటు ప్రాణాపాయం జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. అయితే ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిపించే కొన్ని లక్షణాలు.. గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలు కావచ్చని.. వాటిని విస్మరించవద్దని సూచిస్తున్నారు. అవేంటో.. గుర్తిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి (నిద్రలో నొప్పి అని లైట్ తీసుకోకండి)

ఉదయం నిద్రలేచిన వెంటనే ఛాతీలో ఒత్తిడి, బిగుతుగా, మంట లేదా నొప్పిగా అనిపిస్తే జాగ్రత్త. ఈ నొప్పి చేతులు, మెడ, దవడ లేదా వెన్ను వరకు వ్యాపించవచ్చు. ఛాతీలో అసౌకర్యంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు, వికారం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలట.

అలసట (మహిళల్లో ఎక్కువ)

తగినంత నిద్రపోయినా ఉదయం లేవగానే తీవ్రమైన అలసట, నీరసం లేదా బలహీనతగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గి ఈ లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (నిర్లక్ష్యం చేస్తే అంతే)

ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా నిద్రలేచిన వెంటనే ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ప్రమాదకర సంకేతం. గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపించలేకపోతే ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శ్వాస సమస్యలు కలిగించవచ్చు. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయరాదు.

చల్లటి చెమటలు పట్టడం (వెంటనే ఆస్పత్రికి వెళ్లిపోండి)

ఉదయం నిద్రలేచినప్పుడు కారణం లేకుండానే అధికంగా చెమటలు పట్టడం లేదా చల్లటి చెమటలు రావడం గుండెపోటు హెచ్చరిక కావచ్చు. రక్తప్రసరణలో సమస్య ఏర్పడినప్పుడు శరీరం ఒత్తిడికి గురై ఇలా స్పందిస్తుంది. ఛాతి నొప్పి, శ్వాస సమస్యలతో పాటు ఈ లక్షణం కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

తల తిరగడం (ఉదయాన్నే కామన్ అయినా జాగ్రత్త)

ఉదయాన్నే నిద్రలేచినప్పుడు కొందరికి ఈ తరహా లక్షణం కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా తల తిరగడం, కళ్లు మసకబారడం లేదా మైకం వచ్చినట్లు అనిపిస్తే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. గుండె సరిగా పనిచేయకపోతే మెదడుకు రక్తప్రవాహం తగ్గి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతర లక్షణాలతో కలిసి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వికారం లేదా వాంతులు (ఆ లక్షణాలు కూడా ఉంటే జాగ్రత్త)

ఉదయం లేవగానే వికారం, కడుపు అసౌకర్యం లేదా వాంతి వచ్చినట్లు అనిపించడం చాలామంది జీర్ణకోశ సమస్యగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఛాతి నొప్పి, చెమటలు లేదా శ్వాస సమస్యలతో పాటు వికారం ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పైన ఉన్న అన్ని ఏ లక్షణమైనా మీరు ఎప్పుడూ అనుభవించకుండా సడెన్గా జరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఈ లక్షణాలు ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచి బయట పడగలుగుతారు. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్తీ డైట్, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ కూడా చాలా ముఖ్యం. 

గుర్తించుకోవాల్సిన విషయం

ఈ లక్షణాలు కనిపించాయని ప్రతి సారి గుండెపోటు అనుకుంటే పొరపాటే. కానీ ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, తల తిరగడం వంటి లక్షణాలు కలిసి కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

గుండె ఆరోగ్యం గురించిన మరింత సమాచారం కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget