అన్వేషించండి

Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి

Snoring or Sleep Apnoea : నిద్రలో గురక పెట్టడం సాధారణమే అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. గురకతో పాటు శ్వాస మధ్యమధ్యలో ఆగిపోవడం, ఉలిక్కిపడి లేవడం వంటి లక్షణాలు గుండె ఆరోగ్యానికి మంచివి కాదట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గురకతో పాటు శ్వాస ఆగినచో అది స్లీప్ అప్నియా.
  • పురుషులలో స్థూలకాయం, అలవాట్లు స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచును.
  • పగటి నిద్ర, అలసట లక్షణాలుంటే వైద్య నిర్ధారణ, చికిత్స ముఖ్యం.

Men and Sleep Apnoea : రాత్రిపూట నిద్రలో గురక పెట్టడం చాలామందికి అలవాటు. కొందరు దాన్ని సాధారణ సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ గురకతో పాటు మధ్యమధ్యలో శ్వాస ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం, పగటిపూట విపరీతంగా నిద్ర రావడం వంటి లక్షణాలు ఉంటే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె ఆరోగ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి సాధారణ గురకకు, స్లీప్ అప్నియాకు మధ్య తేడా ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి?

గురకకు, స్లీప్ అప్నియాకు తేడా ఏంటి?

నిద్రపోయినప్పుడు గొంతు కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో గాలి వెళ్లే మార్గంలోని కణజాలం కంపించడం వల్ల గురక శబ్దం వస్తుంది. సాధారణ గురకలో శ్వాస కొనసాగుతూనే ఉంటుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో నిద్రలో గొంతు వెనుక భాగంలోని శ్వాసమార్గం పదేపదే ఇరుకుగా మారడం లేదా పూర్తిగా మూసుకుపోవడం జరుగుతుంది. దీంతో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. తిరిగి శ్వాస తీసుకునేందుకు మెదడు శరీరాన్ని కొద్దిసేపు మేల్కొలుపుతుంది. ఇలా రాత్రంతా పలుమార్లు జరగవచ్చు.

Also Read : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ విషయంపై హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ కె యుగవీర్ గౌడ్ పలు విషయాలు తెలిపారు. యుగవీర్ ప్రకారం.. సాధారణ గురకలో గాలి శ్వాసమార్గం గుండా వెళ్తున్నప్పుడు గొంతులోని కండరాలు, కణజాలం కంపించడం వల్ల శబ్దం వస్తుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో శ్వాసమార్గం పదేపదే మూసుకుపోవడం వల్ల కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. శరీరం తిరిగి శ్వాస తీసుకునేలా మెదడు నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

పురుషుల్లో ఈ సమస్యకు కారణాలు ఏంటి?

మహిళలతో పోలిస్తే పురుషుల్లో స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ యుగవీర్ తెలిపారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ ప్రమాదం పెరగవచ్చని.. ఆ సమయంలో మెడ చుట్టుకొలత ఎక్కువ కావడం, పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం, అధిక బరువు, సాయంత్రం లేదా రాత్రి మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయని అన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉందట. 

 Also Read : నిద్ర, డిప్రెషన్ మందులు ఎవరికి ఎక్కువ ప్రమాదం? కిందపడే రిస్క్‌పై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

స్లీప్ అప్నియా ఉన్నవారిలో గురక చాలా బిగ్గరగా వస్తుంది. మధ్యమధ్యలో శ్వాస ఆగినట్లు అనిపించడం, మళ్లీ ఒక్కసారిగా గాలి పీల్చుకుంటూ ఉలిక్కిపడి లేవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఉదయం నిద్రలేచినప్పుడు నోరు పొడిబారడం, తలనొప్పి, గొంతు నొప్పి రావచ్చు. రాత్రంతా నిద్రపోయినా పగటిపూట అలసటగా అనిపించడం, పని సమయంలో నిద్ర ముంచుకురావడం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, మూడ్ మార్పులు కూడా కనిపించవచ్చు. కొందరిలో రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు. 

నిర్లక్ష్యం చేస్తే గుండెకు ప్రమాదమా?

నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో గుండె లయలో అసమానతలు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదంతో స్లీప్ అప్నియాకు సంబంధం ఉంది. అంతేకాదు, సరైన నిద్ర లేకపోవడం వల్ల రోజువారీ పనితీరు దెబ్బతినవచ్చు. డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు రావడం ప్రమాదాలకు దారితీయవచ్చు.

Also Read : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

గురక తగ్గించే స్ప్రేలు వాడవచ్చా?

గురక తగ్గించేందుకు మార్కెట్లో అనేక స్ప్రేలు, మౌత్ గార్డులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి శబ్దాన్ని కొంతవరకు తగ్గించినా.. శ్వాసమార్గం మూసుకుపోవడం అనే అసలు సమస్యను పరిష్కరించకపోవచ్చు. ముఖ్యంగా స్లీప్ అప్నియా ఉన్నవారు గురక తగ్గించే ఉత్పత్తులపై ఆధారపడితే.. సమస్య నిర్ధారణ, చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

స్లీప్ అప్నియాను ఎలా నిర్ధారిస్తారు?

బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోవడం, ఉదయం లేచినా అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి స్లీప్ స్టడీ (పాలిసోమ్నోగ్రఫీ) లేదా ఇంటి వద్ద చేసే స్లీప్ అప్నియా పరీక్షను సూచించవచ్చు. ఈ పరీక్షలో నిద్ర సమయంలో శ్వాస, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు, గుండె స్పందన వంటి అంశాలను పరిశీలిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా సమస్య తీవ్రతను గుర్తించి చికిత్స చేస్తామని డాక్టర్ యుగవీర్ తెలిపారు.

Also Read : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

స్లీప్ అప్నియా చికిత్సలు

స్లీప్ అప్నియాకు చికిత్స అనేది సమస్య తీవ్రత, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం, నిద్రకు ముందు మద్యం తీసుకోకపోవడం, వీలైనంత వరకు పక్కకు తిరిగి పడుకోవడం వంటి మార్పులతో కొంతమేర ప్రయోజనం పొందవచ్చు. అవసరమైతే వైద్యులు CPAP మెషిన్ సూచిస్తారు. ఇది నిద్రపోయే సమయంలో మాస్క్ ద్వారా స్వల్ప గాలి ఒత్తిడిని అందించి శ్వాసమార్గం మూసుకుపోకుండా ఉంచుతుంది. కొందరికి నోటిలో అమర్చే ప్రత్యేక పరికరాలు లేదా ఇతర చికిత్సలు అవసరమవుతాయి.

అయితే గురక పెట్టే ప్రతి ఒక్కరికీ స్లీప్ అప్నియా ఉందని అనుకోకూడదు. అలాగే గురకను కేవలం అలవాటుగా కొట్టిపారేయడం కూడా సరికాదని అంటున్నారు నిపుణులు. నిద్రలో శ్వాస ఆగిపోవడం, పగటిపూట నిద్రమత్తు, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget