అన్వేషించండి

Sleep and Depression Medicines : నిద్ర, డిప్రెషన్ మందులు ఎవరికి ఎక్కువ ప్రమాదం? కిందపడే రిస్క్‌పై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Sleep Medicines and Falls : ఈ రోజుల్లో నిద్ర సమస్యలకు చికిత్స చేయడానికి నిద్రమాత్రల వాడకం కామన్ అయిపోయింది. అయితే ఈ మందులే వృద్ధులకు ప్రమాదకరంగా మారవచ్చని కొత్త అధ్యయనం తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వృద్ధులలో నిద్ర, డిప్రెషన్ మందులు పడిపోవడానికి దారితీస్తాయి.
  • మందుల ప్రభావంతో మగత, సమతుల్యత కోల్పోయి పడిపోవచ్చు.
  • అధ్యయనం మందులకు, పడిపోవడానికి స్పష్టమైన సంబంధం తేల్చింది.
  • వైద్య సలహా లేకుండా మందులు ఆపకూడదు; జాగ్రత్తలు పాటించాలి.

Sleep and Depression Medicines Linked to Higher Fall Risk : వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో నిద్రలేమి కూడా ఒకటి. ఈ సమస్యతో ఇబ్బంది పడే కొందరికి వైద్యులు నిద్ర, డిప్రెషన్  మందులను సూచిస్తారు. ఈ మందులు డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంతో పాటు.. మెరుగైన నిద్రను అందిస్తాయి. అయితే వీటి ప్రభావం అందరిపై ఒకేలా ఉండవని చెప్తున్నారు నిపుణులు.

కొన్నిరకాల మందులు ముఖ్యంగా నిద్ర, డిప్రెషన్ మందులు వృద్ధులలో.. అధిక నిద్రమత్తు, తల తిరగడం లేదా నడవడంలో ఇబ్బందిని కలిగిస్తాయట. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం పెరుగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వైద్యులు చేసిన ఒక అధ్యయనంలో.. వృద్ధులలో మందులకు, కింద పడిపోవడానికి మధ్య సంబంధం ఉందని కూడా కనుగొన్నారు.

Also Read : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

మందులు తీసుకుంటే ఎందుకు పడిపోతారంటే.. 

కొన్ని నిద్రమాత్రలు మనసును ప్రశాంతపరిచి.. నిద్ర పట్టడానికి సహాయపడతాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా వాటి ప్రభావం తరచుగా కొనసాగుతుంది. దీంతో వృద్ధులు నిద్రలేచినప్పుడు మగతగా, తల తిరిగినట్లుగా లేదా నీరసంగా అనిపించవచ్చు. దీనివల్ల నడిచేటప్పుడు సమతుల్యత దెబ్బతినవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట బాత్రూమ్‌కు వెళ్లడానికి హఠాత్తుగా లేచినప్పుడు కింద పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని మందులు కూడా తల తిరగడం లేదా నిద్రమత్తుకు కారణం కావచ్చు. వయసు పెరిగే కొద్దీ.. శరీరం ఈ మందులను మునుపటి కంటే నెమ్మదిగా తీసుకుంటుంది. కాబట్టి వృద్ధులలో ఈ మందుల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. 

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

అధ్యయనంలో తేలిన విషయాలివే..

స్టడీలో భాగంగా పరిశోధకులు పెద్ద సంఖ్యలో వృద్ధుల ఆరోగ్య డేటాను పరిశీలించారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలకు మందులు తీసుకుంటున్న వారిపై దృష్టి సారించారు. ఈ మందులు తీసుకోని వారితో పోలిస్తే.. వాటిని తీసుకుంటున్న వృద్ధులకు కింద పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేల్చారు. ఇందులో నిద్రకు సహాయపడే మందులతో పాటు.. కొన్ని డిప్రెషన్ మందులు కూడా ఉంటాయి. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మందులు తీసుకునే ప్రతి వృద్ధుడు కింద పడిపోతాడని అర్థం కాదు. మందుల ప్రభావం వ్యక్తి వయస్సు, శరీర రకం, వారు తీసుకునే ఇతర మందులపై ఆధారపడి ఉంటాయి.

Also Read : పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే

మందులు ఆపేయడం మంచిదా?

ఒకవేళ వృద్ధులు నిద్ర లేదా డిప్రెషన్ కోసం మందులు తీసుకుంటుంటే.. వారు స్వయంగా ఆపకూడదు. మోతాదును పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. మందులు తీసుకున్న తర్వాత వృద్ధులకు తల తిరగడం, అధిక నిద్రమత్తు, లేదా నడవడంలో ఇబ్బంది వంటివి కలగకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

రాత్రిపూట బాత్రూమ్‌కు వెళ్లే దారిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నిద్ర సమస్యలను తగ్గించుకోవడం కోసం.. వైద్యులు నిద్రను మెరుగుపరచడానికి వ్యాయామం, ప్రాణాయామం వంటి ఇతర మార్గాలను సిఫార్సు చేస్తారు.

Also Read : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Afghani Green Chicken : అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget