అన్వేషించండి

Height Growth in Children : పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే

Healthy Height Growth in Children : పిల్లలు ఎత్తుపెరగడానికి జన్యుపరమైనవే కాకుండా.. కొన్ని అలవాట్లు కూడా అవసరమని నిపుణులు చెప్తున్నారు. పిల్లల పెరుగుదల గురించి పీడియాట్రిషియన్ ఇచ్చిన సలహాలు ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిల్లల ఎత్తుకు జన్యువులు, పోషకాహారం, నిద్ర, వ్యాయామం ముఖ్యం.
  • పోషకాహారం, నిద్ర ఎదుగుదల హార్మోన్ల విడుదలలో కీలక పాత్ర.
  • వ్యాయామం, మానసిక ఆరోగ్యం పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు అవసరం.
  • ఎదుగుదల సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలి, ముందస్తు గుర్తింపు మేలు.

Child's Height Growth : పిల్లల ఎత్తు ఎంత పెరుగుతుందనేది ఎక్కువగా జన్యుపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పోషకాహారం, నిద్ర, వ్యాయామం, జీవనశైలి, మొత్తం ఆరోగ్య పరిస్థితి కూడా వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన అలవాట్లు ఉంటే పిల్లలు తమకు సహజంగా వచ్చే గరిష్ట ఎత్తును చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల ఎదుగదలకు సంబంధించి యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ & నియోనటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ డి. శ్రీకాంత్ పలు విషయాలు తెలిపారు. పిల్లల ఎదుగుదల విషయానికి వస్తే.. ఎత్తు పెరగాలంటే ఆహారం, నిద్ర, శారీరక శ్రమ చాలా ముఖ్యమని తెలిపారు.

పోషకాహారం 

పిల్లల ఎముకల పెరుగుదల, శారీరక అభివృద్ధికి ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D, ఐరన్, జింక్ వంటి పోషకాలు అవసరం. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా పిల్లలకు ఇవ్వడం మంచిది.

అయితే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు శరీరానికి అందకపోవచ్చు. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నిద్ర తక్కువైతే పెరగడం కష్టమే..

పిల్లల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రి గాఢ నిద్ర సమయంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లేకపోవడం, పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూడడం వంటి అలవాట్లు వల్ల గ్రోత్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపవచ్చు. అందుకే పిల్లల వయసుకు తగినంత నిద్ర అందేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం కూడా ముఖ్యమే..

పిల్లలు రోజంతా కూర్చునే ఉండటం, స్క్రీన్ టైమ్ పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఎదుగుదల విధానాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. కాబట్టి పిల్లలతో రన్నింగ్, దూకడం, ఈత, సైక్లింగ్, ఆటలు ఆడటం వంటి శారీరక కార్యకలాపాలు చేయించాలని సూచిస్తున్నారు డాక్టర్ శ్రీకాంత్. ఇవి ఎముకలు, కండరాలు బలంగా ఎదగడానికి సహాయపడతాయని తెలిపారు. 

మానసిక ఆరోగ్యం

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు తెలిపారు. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, ఇంట్లో లేదా పాఠశాలలో ప్రతికూల వాతావరణం హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు. ప్రేమ, ప్రోత్సాహం, మానసిక మద్దతు ఉన్న వాతావరణంలో పిల్లలు మెరుగ్గా ఎదుగుతారని నిపుణులు చెప్తున్నారు.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే.. 

పిల్లల ఎత్తు పెరుగుదలను క్రమం తప్పకుండా గమనించడం చాలా ముఖ్యం. అదే వయసు పిల్లలతో పోలిస్తే చాలా పొట్టిగా ఉండటం, ఎదుగుదల వేగం తగ్గిపోవడం, యుక్తవయస్సు లక్షణాలు చాలా త్వరగా లేదా ఆలస్యంగా కనిపించడం వంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి.

గ్రోత్ హార్మోన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు లేదా కొన్ని జన్యుపరమైన పరిస్థితులు కూడా ఎత్తు పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని సలహాలు ఇచ్చారు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget