అన్వేషించండి

Sleep Tips Telugu : రాత్రుళ్లు నిద్ర రావట్లేదా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చిటికెలో నిద్రపోతారు

Tips to Sleep Better and Faster : రాత్రి నిద్ర బాగా పడితే ఉదయం అంత ప్రొడెక్టివ్​గా ఉంటుంది. మరి మీకు నిద్రపోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి. త్వరగా నిద్రపోవచ్చట.

Easy Lifestyle Changes for Sleep Faster : కొందరికి ఎంత ట్రై చేసినా నిద్ర త్వరగా రాదు. మరికొందరు చిటికెలో నిద్రపోతారు. అయితే మీకు నిద్రతో సమస్య ఉంటే.. వెంటనే మీ లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. ఆ టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా మీరు కూడా త్వరగా నిద్రపోయే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. అవి మెరుగైన నిద్రకు ఎలా హెల్ప్ చేస్తాయో చూసేద్దాం. 

స్లీపింగ్ షెడ్యూల్.. 

ఎక్కువమంది చేసే మిస్టేక్ ఏంటంటే.. స్లీపింగ్ షెడ్యూల్ మెయింటైన్ చేయకపోవడం. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ సరిగ్గా పనిచేయదు. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోండి. ఇది శరీర సిర్కాడియన్ రిథమ్‌ను సరిచేస్తుంది. ఇది అలవాటు అయితే చాలా తొందర్లోనే మీరు అదే టైమ్​కి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా నిద్ర పోగలుగుతారు.

నో కెఫిన్

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉన్న కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. కాబట్టి నిద్రకు కనీసం 6 గంటల ముందు వాటిని తీసుకోవడం ఆపేయాలి. మీకు ఏదైనా వేడిగా తాగాలనుకుంటే హెర్బల్ డ్రింక్స్, మిల్క్ ట్రై చేయవచ్చు. 

ఆల్కహాల్

మద్యం మత్తు ఇస్తుందనుకుంటారు కానీ అది సహజమైన స్లీప్ సైకిల్​ని డిస్టర్బ్ చేస్తుంది. నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్​కి కూడా దూరంగా ఉండాలి. 

శుభ్రత

బెడ్​ రూమ్​ ఎప్పుడూ నీట్​గా ఉండాలి. దీనివల్ల ఆలోచనల సానుకూలంగా ఉంటాయి. అలాగే రూమ్ టెంపరేచర్ మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. లైట్స్ డిమ్​గా ఉంటే నిద్ర త్వరగా వస్తుంది. 

స్క్రీన్ టైమ్

రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ నిద్రను ఆపేసుకుంటున్నారా? ఇది ఓ రకమైన వ్యసనంగా చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి నిద్రకు గంట ముందు గాడ్జెట్లు దూరంగా పెట్టండి.

నైట్ రొటీన్

రాత్రుళ్లు ప్రశాంతమైన రొటీన్ ఉండేలా చూసుకోండి. ఆ సమయంలో పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా గోరువెచ్చని స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో శరీరం నిద్రకు సిద్ధమవుతుంది.

భోజనంలో మార్పులు

రాత్రుళ్లు డీప్ ఫ్రై చేసినా, వేయించిన, కారం, మసాలాలతో కూడిన ఫుడ్స్​ తీసుకోకపోవడమే మంచిది. లేదంటే జీర్ణ సమస్యలు నిద్రను దూరం చేస్తాయి. పైగా బరువు పెరిగిపోతారు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

పగటి నిద్ర

పగలు 20–30 నిమిషాలు చిన్న నాప్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి పగలు తక్కువగా రెస్ట్ తీసుకోండి.

డీప్ బ్రీతింగ్

లోతైన శ్వాస, ధ్యానం వంటి పద్ధతులు మనస్సును ప్రశాంతం చేస్తాయి. పడుకునే ముందు ఆలోచనలు రాయడం కూడా ఉపయోగపడతాయి.

ఇవన్నీ మీరు డైలీ ఫాలో అయితే కచ్చితంగా త్వరగా నిద్రపోగలుగుతారు. ఉదయం వ్యాయమం చేయడం, ఎండలో ఉండడం వల్ల కూడా గాఢ నిద్ర మీకు అందుతుంది. కాబట్టి ఈ చిన్న టిప్స్ రెగ్యులర్​గా ఫాలో అవ్వండి. మంచి నిద్రను సొంతం చేసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget