అన్వేషించండి

Vitamin D : విటమిన్ డి లోపం, ఓవర్‌డోస్ రెండూ ప్రమాదమే.. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

Vitamin D Supplements : విటమిన్ డి శరీరంలో ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. లోపం ఉంటే ఎలా భర్తీ చేయాలి? ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
  • సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయి ప్రమాదకరం.
  • రక్తంలో కాల్షియం స్థాయి పెరిగి కిడ్నీలు, ఎముకలు దెబ్బతింటాయి.
  • లోపంతో పాటు అధిక మోతాదు కూడా ఆరోగ్యానికి హానికరం.

Vitamin D Deficiency vs Overdose : ఈ మధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి సప్లిమెంట్స్‌ తీసుకుంటున్నారు. ఎందుకంటే శరీరంలో విటమిన్ డి లోపిస్తే.. ఎముకల్లో బలం తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గి, నీరసంగా ఉంటారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వైద్యులు విటమిన్ డి సప్లిమెంట్స్ సూచిస్తున్నారు. కానీ మీకు తెలుసా? విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. 

విటమిన్ డి..

విటమిన్ డి అనేది విటమిన్ సి లాంటి వాటిలా కాదు. ఇది ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్. అంటే ఇది శరీరంలో నిల్వవుతుంది. అందుకే అవసరానికి మించి తీసుకుంటే.. అది బయటకు వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోయి ప్రమాదకర స్థాయికి చేరుతుంది. సాధారణంగా ఆహారం లేదా సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ D వల్ల సమస్య ఉండదు. కానీ సప్లిమెంట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్లే ఓవర్‌డోస్ సమస్య వస్తుందని వైద్యులు చెప్తున్నారు. 

చాలామంది విటమిన్ డి లోపం ఉందని.. వైద్యులు సూచించినా.. సూచించకున్నా.. సప్లిమెంట్స్ తీసేసుకుంటారు. అలా తీసుకుంటే ఓవర్‌డోస్ అయ్యే ప్రమాదం ఉంది. అలా విటమిన్ డి శరీరంలో ఎక్కువ పేరుకుంటే వచ్చే నష్టాలు ఏంటో చూసేద్దాం. 

విటమిన్ డి ఎక్కువైతే..

విటమిన్ D ఎక్కువైతే రక్తంలో కాల్షియం స్థాయి అధికమవుతుంది. దీనిని హైపర్‌కాల్సీమియా అంటారు. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఎముకలు కూడా బలహీనపడి.. శరీర అవయవాలకు నష్టం కలిగిస్తాయి.

ఓవర్‌డోస్ అయితే కలిగే లక్షణాలు ఇవే..

విటమిన్ డి ఓవర్ డోస్ అయితే కొన్ని లక్షణాలను శరీరం ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాంతులు, వికారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, దాహం ఎక్కువగా వేయడం, తరచుగా మూత్రం పోవడం, అలసట, కండరాల బలహీనత, బరువు తగ్గడం, కన్ఫ్యూజన్, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన స్థితిలో కిడ్నీ డ్యామేజ్ కూడా జరుగుతుంది.

విటమిన్ D లోపం వల్ల వచ్చే సమస్యలు

విటమిన్ D తగ్గినా కూడా సమస్యలే వస్తాయి. ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, అలసట, ఇమ్యూనిటీ తగ్గడం, పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో ఆస్టియోపొరోసిస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 

విటమిన్ డి లోపం ఉంటే.. 

విటమిన్ డి లోపం ఉంటే.. రోజూ 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉండాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్స్ తీసుకోకూడదు. బ్లడ్ టెస్ట్ చేయించుకుని.. అవసరమైతేనే డోస్ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. అలాగే విటమిన్ డి సహజంగా లభించే ఆహారాలు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, చేపలు, పాలు, మష్రూమ్స్ వంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది. 

విటమిన్ D శరీరానికి చాలా అవసరం. అలా అని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మొత్తానికి తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైద్యుల సలహాతో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Embed widget