డెస్క్ వర్క్ చేసే వారిలోనే ఎక్కువ విటమిన్ డి లోపం.. కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఈ రోజుల్లో ఆఫీస్ జాబ్స్ వల్ల చాలా మంది సూర్యరశ్మి తక్కువగా పొందుతున్నారు.

దీనివల్ల చాలామందిలో విటమిన్ డి లోపం వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

డెస్క్ జాబ్ చేసేవారిలో విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు ఏంటో చూసేద్దాం.

రోజంతా ఇండోర్‌లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.

సూర్యరశ్మి తక్కువగా తగలడం వల్ల కూడా విటమిన్ డి లోపం వస్తుంది.

చాలామంది సన్‌స్క్రీన్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల కూడా లోపం పెరుగుతుంది.

ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా విటమిన్ డి తగ్గుతుంది.

విటమిన్ డి ఉండే ఆహారం డైట్లో తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.

విటమిన్ డి లోపిస్తే ఎముకల బలహీన పడటంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

కాబట్టి వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు.. ఎండలో ఉంటే మంచిది.