కడుపు క్యాన్సర్ హెచ్చరిక లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేయకండి

Published by: Geddam Vijaya Madhuri

తరచుగా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం ఉంటే జాగ్రత్త.

ఆహారం మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం.

కొద్దిగా తిన్నా వెంటనే ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది.

ఎలాంటి డైట్ లేకుండా వేగంగా బరువు తగ్గిపోవడం దీని లక్షణం.

తరచుగా కడుపులో నొప్పి, అసహజమైన ఫీలింగ్ ఉంటే జాగ్రత్త.

వాంతులు రావడం, ముఖ్యంగా రక్తం కనిపిస్తే మరింత జాగ్రత్త అవసరం.

మలం నల్లగా లేదా రక్తంతో ఉండటం ప్రమాద సంకేతంగా చెప్తారు.

ఏ పని చేయకున్నా శరీరం ఎప్పుడూ అలసటగా ఉంటుంది.

బలహీనత, తిరగడం వంటి లక్షణాలు దీనిలో భాగమే.

తినేటప్పుడు మింగడం కూడా కష్టంగా అనిపిస్తుంది.