మసక చూపును తగ్గించే సులభమైన అలవాట్లు

Published by: Geddam Vijaya Madhuri

ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడండి.

మొబైల్, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి తగ్గించండి.

చీకట్లో లేదా ఎక్కువ వెలుతురులో స్క్రీన్ చూడడం కళ్లకు హానికరం.

కళ్లను తరచుగా బ్లింక్ చేయండి. ఇది కళ్లలో తేమను నిలుపుతుంది, డ్రై ఐ సమస్య తగ్గుతుంది.

క్యారెట్, పాలకూర, బాదం లాంటి విటమిన్ A & E ఉన్న ఆహారం తీసుకోవాలి.

డీహైడ్రేషన్ వల్ల కూడా కళ్లకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మంచిగా నీరు తాగండి.

చేతులతో కళ్లను రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

బయటకి వెళ్తే UV రేస్ నుంచి కళ్లను రక్షించండి.

రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర అవసరం.

రెగ్యులర్ ఐ చెక్-అప్ చేయించుకుంటే మంచిది.