వేసవిలో కూడా టీ ఎక్కువ తాగుతున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఎందుకంటే.. టీ లోని కెఫీన్ శరీరంలోని నీరు తగ్గించి డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది.

వేసవిలో టీ ఎక్కువ తాగితే బాడీ హీట్ పెరిగి అసౌకర్యం కలుగుతుంది.

ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వస్తాయి.

కెఫీన్ కారణంగా నిద్రలేమి సమస్యలు రావచ్చు.

టీ ఎక్కువగా తాగితే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది హార్ట్పై ప్రభావం చూపిస్తుంది.

అధిక కాఫీన్ వల్ల తలనొప్పి, మానసిక అలసట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరం ఐరన్‌ను సరిగా గ్రహించలేకపోతుంది.

సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలు మరింత పెరుగుతాయి. జీర్ణక్రియలో సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలగవచ్చు.

డీహైడ్రేషన్ వల్ల చర్మం ఎండిపోయి డల్‌గా మారుతుంది.

రోజుకు ఎక్కువ టీ తాగడం అలవాటుగా మారి.. తాగకపోతే తలనొప్పి, చికాకు వస్తాయి.