కలబందతో హెయిర్ మాస్క్.. ఇలా చేసి, అలా అప్లై చేయండి

Published by: Geddam Vijaya Madhuri

కలబందతో హెయిర్ మాస్క్ చేసుకోవాలనుకుంటే ఫ్రెష్ ఆకును ఎంచుకోవాలి.

దుమ్ము, మలినాలు లేకండా కలబందను బాగా కడగాలి.

ఆకును మధ్యలో కట్ చేసి లోపల ఉన్న జెల్‌ను స్పూన్‌తో తీసుకోండి.

ఇలా తీసిన జెల్ మిక్సీలో వేసి స్మూత్గా తయారు చేసుకుంటే అప్లై చేయడం సులభం అవుతుంది.

కొబ్బరి నూనె, తేనె, పెరుగు లేదా నిమ్మరసం కలిపితే మరింత బెనిఫిట్ ఉంటుంది.

మాస్క్ బాగా పట్టేందుకు జుట్టును చిన్న చిన్న సెక్షన్స్‌గా విడగొట్టి అప్లై చేయాలి.

ముందుగా స్కాల్ప్ పై బాగా అప్లై చేసి.. తర్వాత జుట్టు పొడవునా అప్లై చేయండి.

5–10 నిమిషాలు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

అరగంట ఉంచుకుంటే.. జెల్ లోని పోషకాలు జుట్టుకు బాగా అందుతాయి.

గోరువెచ్చని నీటితో కడిగి, మైల్డ్ షాంపూతో వాష్ చేయండి. వారానికి 1,2 సార్లు చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.