పీరియడ్స్ నెలకంటే ముందుగా రావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఎక్కువ టెన్షన్ వల్ల హార్మోన్లలో మార్పులు వచ్చి పీరియడ్స్ ముందుగా రావచ్చు.

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవల్స్ మారితే పీరియడ్ సైకిల్ మారుతుంది.

అధికంగా వర్కౌట్స్ చేయడం వల్ల కూడా పీరియడ్స్ టైమింగ్ మారుతుంది.

అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా పీరియడ్ సైకిల్‌ ప్రభావితం అవుతుంది.

థైరాయిడ్ డిసార్డర్స్ వల్ల పీరియడ్స్ ముందుగానో, ఆలస్యంగానో రావచ్చు.

కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి.

వయసు పెరిగే కొద్దీ పీరియడ్ సైకిల్ అసమానంగా మారుతుంది.

PCOS సమస్య ఉన్నవారికి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు.

యోనీలో లేదా రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఇన్ఫెక్షన్స్ ఉంటే మార్పులు వస్తాయి.

నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, ప్రయాణాలు వంటి మార్పులు కూడా కారణం అవుతాయి.