అన్వేషించండి

Struggling to Sleep : శరీరం అలసిపోయినా నిద్ర రాకపోవడానికి కారణాలు ఇవే.. ఈ టిప్స్​తో బాడీకి రెస్ట్ ఇచ్చేయండి

Tips to Stop Overthinking at Night : మీ శరీరం బాగా అలసిపోయినా.. రాత్రి అయ్యే సరికి మీ మైండ్ యాక్టివ్​గా ఉండి నిద్ర రావట్లేదా? అయితే కారణాలు ఇవే.. వాటి గుర్తించి రీసెట్ చేసుకుంటే హాయిగా నిద్రపోతారట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రిపూట మెదడులోని డీఫాల్ట్ మోడ్ నెట్​వర్క్ చురుగ్గా మారుతుంది.
  • ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అధికంగా ఉండటం నిద్రను కష్టతరం చేస్తుంది.
  • మెదడులోని కెమికల్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఆలోచనలు పెరుగుతాయి.
  • స్క్రీన్ సమయం తగ్గించి, క్రమమైన నిద్ర అలవాట్లు మెరుగుపరుస్తాయి.

రోజంతా తీవ్రమైన పని చేస్తే.. రాత్రి పడుకునేసరికి శరీరం చాలా అలసిపోతుంది. ఆ సమయంలో బాడీ రెస్ట్ కోరుకుంటంది. కానీ మైండ్ యాక్టివ్​గా ఉండి నిద్ర రానివ్వదు. బదులుగా మరింత చురుకుగా మారి.. పాత ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆందోళన, అనవసరమైన విషయాలు మనసులో తిరిగేలా చేస్తుంది. దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది. ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట అతిగా ఆలోచించడం, నిద్రలేమి సమస్య సాధారణమైనది లేదా ఆకస్మికమైనది కాదని అంటున్నారు. దీని వెనుక మనసు, శరీరం, ఒత్తిడికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో.. ఆలోచనలకు చెక్ పెట్టి.. నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలో చూసేద్దాం. 

డీఫాల్ట్ మోడ్ నెట్​వర్క్..

రాత్రిపూట మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ అనే భాగం చురుకుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం స్వీయ విశ్లేషణకు, గడిచిన, భవిష్యత్ గురించి ఆలోచించడానికి బాధ్యత వహిస్తుంది. ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడే వ్యక్తులలో.. ఈ ప్రక్రియ మరింత తీవ్రమవుతుంది. వారికి పదేపదే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఈ కారణంగానే నిద్రలో కూడా మెదడు ప్రశాంతంగా ఉండలేదు.

కార్టిసాల్ లెవెల్స్..

రాత్రిపూట శరీరం క్రమంగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ నిద్రలేమితో బాధపడేవారిలో ఒత్తిడికి సంబంధించిన వ్యవస్థ చురుకుగా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అధికంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఇంకా ఒత్తిడిలో లేదా ముప్పులో ఉన్నట్లు భావిస్తుంది. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.

కెమికల్స్ బ్యాలెన్స్ తప్పితే..

మంచి నిద్రకు మెదడులోని కొన్ని కెమికల్స్ బ్యాలెన్స్ అవసరం. వీటిలో కొన్ని మనసును ప్రశాంతపరిస్తే.. మరికొన్ని దానిని మేల్కొని ఉండేలా చేస్తాయి. ఈ సమతుల్యతకు భంగం కలిగినప్పుడు.. మెదడు విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఆలోచనలు, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమి మెదడులోని నిర్ణయాలు తీసుకునే, ఎమోషన్స్ నియంత్రించే భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చిన్న విషయాలు కూడా పెద్దవిగా, మరింత బాధాకరంగా అనిపించవచ్చు. ఈ ప్రభావం రాత్రిపూట మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఆందోళన, అతిగా ఆలోచించనలు పెరగడానికి కారణమవుతుంది. 

జీర్ణ సమస్యలు..

జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య గాఢమైన సంబంధం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. జీర్ణాశయ సంబంధిత సమస్యలు లేదా ఇబ్బందులు ఉంటే.. అది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు, నిద్ర సమస్యలు తరచుగా కలిసి కనిపిస్తాయి.

మరిన్ని మిస్టేక్స్.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రోజువారీ అలవాట్లు కూడా రాత్రిపూట మనసు ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి. అవేంటంటే.. రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, పొద్దుపోయే వరకు మొబైల్ ఫోన్లు లేదా స్క్రీన్‌లను ఉపయోగించడం, మద్యం సేవించడం లేదా కొన్ని రకాల మందులు తీసుకోవడం వంటివి స్లీప్​ సైకిల్​ను దెబ్బతీస్తాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను గణనీయంగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం, తేలికపాటి వ్యాయామం, ధ్యానం లేదా నిద్ర సమస్యకు వైద్యుడి సహాయంతో మందులు తీసుకోవడం వంటివన్నీ సహాయపడతాయి. సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ఆలోచనలు దూరం చేసి.. ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget