అన్వేషించండి

Roasted Peanuts : రోజూ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Handful of Peanuts Daily : పల్లీలు నోటికి రుచిగా ఉంటాయి. అయితే వీటిని వేయించుకుని రోజూ ఓ గుప్పెడు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు చాలా ఉన్నాయి. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేయించిన పల్లీలలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
  • ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.
  • పల్లీలు మెదడు పనితీరు, ఎముకల బలాన్ని పెంచుతాయి.
  • అధికంగా తింటే అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

Eating Roasted Peanuts for Health : పల్లీలు (వేరుశెనగలు) టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్​లలో ఒకటి. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. ఉడికించి, వేయించి, పొడి రూపంలో, వివిధ వంటకాల్లో పల్లీలు వేసుకుంటారు. ఇవి మంచి రుచిని ఇస్తాయి. అయితే రోజూ వేయించిన పల్లీలు ఓ గుప్పెడు తింటే శరీరానికి ఎంత మేలు జరుగుతుందో, ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

వేయించిన పల్లీల్లోని పోషకాలు.. 

100 గ్రాములు పల్లీల్లో ప్రొటీన్ 25 నుంచి 28 గ్రాములు ఉంటుంది. హెల్తీ ఫ్యాట్ 49 గ్రాములు, ఫైబర్ 8 గ్రాములు, మెగ్నీషియం, విటమిన్ E అధికంగా ఉంటాయి. విటమిన్ B3, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. పచ్చి పల్లీల కంటే.. వేయించిన వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. 

రోజూ పల్లీలు తింటే కలిగే ప్రయోజనాలు.. 

ప్రొటీన్​కు పవర్‌హౌస్ : 100 గ్రాముల పల్లీల్లో దాదాపు చికెన్‌కు సమానమైన ప్రొటీన్ ఉంటుంది. జిమ్‌కు వెళ్లేవారికి, శారీరక శ్రమ చేసేవారికి పల్లీలు సహజమైన ప్రొటీన్ సోర్స్. రోజూ తింటే కండరాలు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

గుండె ఆరోగ్యానికై : పల్లీల్లో మోనోశాచ్యురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతాయి. రోజూ గుప్పెడు పల్లీలు తింటే గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు నిర్ధారించాయి.

మెదడు కోసం : పల్లీల్లో నియాసిన్ (విటమిన్ B3) పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో నియాసిన్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు, వృద్ధులకు పల్లీలు చాలా మేలు చేస్తాయి.

బరువు నియంత్రణకై : పల్లీల్లో ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉన్నందున కడుపు త్వరగా నిండుతుంది. ఎక్కువసేపు ఆకలి అనిపించదు. దీనివల్ల ఎక్కువ తినరు. స్నాక్‌గా తింటే జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్. 

షుగర్ నియంత్రణకై : పల్లీల్లో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. మధుమేహం ఉన్నవారికి పల్లీలు చాలా మంచి స్నాక్. భోజనానికి ముందు కొద్దిగా పల్లీలు తింటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఎముకలు గట్టిపడతాయి : పల్లీల్లో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రత పెంచి, ఆస్టియోపోరోసిస్ ప్రమాదం తగ్గిస్తాయి.

మెరిసే చర్మం : పల్లీల్లో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి లోపల నుంచి పోషణ ఇస్తాయి. ముడతలు పడకుండా చేస్తాయి. రోజూ పల్లీలు తింటే చర్మం సహజంగా మెరుస్తుంది. వయసు కంటే చిన్నగా కనిపిస్తారు.

నిద్ర కోసం : పల్లీల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి మంచి నిద్రకు అవసరమైన హార్మోన్లు. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి కొద్దిగా పల్లీలు తింటే మేలు.

పల్లీల్లో రెస్వెరాట్రోల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో పల్లీలు ఉపయోగపడతాయి. పల్లీల్లో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. 

ఎంత మోతాదులో తినాలి?

రోజుకు ఒక గుప్పెడు.. అంటే దాదాపు 30–40 గ్రాములు సరిపోతుంది. ఇది సుమారు 160–180 కేలరీలు. ఇంతకంటే ఎక్కువ తింటే కేలరీలు అధికమవుతాయి. బరువు పెరగవచ్చు. ఉదయం తింటే రోజంతా యాక్టివ్ ఉంటారు. సాయంత్రం స్నాక్‌గా తింటే జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. రాత్రి భోజనానికి ముందు కొద్దిగా తింటే నిద్ర మెరుగవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పల్లీలు అలర్జీ ఉన్నవారు తినకూడదు. ఉప్పు అధికంగా వేసిన పల్లీలు రోజూ తింటే రక్తపోటు పెరగవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకోవాలి. మోతాదు మించి తింటే అజీర్ణం, గ్యాస్ సమస్య రావచ్చు. బరువు కూడా పెరుగుతారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget