అన్వేషించండి

Sleep in Summer Heat : రాత్రుళ్లు వేడి వల్ల నిద్ర రావట్లేదా? ఏసీ లేకున్నా కూల్‌గా నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Beat the Summer Heat at Night : వేసవిలో ఉక్కపోత వల్ల రాత్రుళ్లు నిద్ర రావట్లేదా? అయితే ఏసీ లేకున్నా హాయిగా ఎలా నిద్రపోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గదిలోకి వేడి రాకుండా కర్టెన్లు మూసి, రాత్రి కిటికీలు తెరవాలి.
  • గోరువెచ్చని నీటితో స్నానం, కాటన్ దుస్తులు మంచి నిద్రనిస్తాయి.
  • ఐస్ వాటర్ బౌల్, చల్లని పానీయాలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి.
  • ఫోన్ పక్కన పెట్టి, విశ్రాంతి తీసుకోవడం నిద్రకు దోహదపడుతుంది.

Simple Hacks to Stay Cool Without AC at Night : వేసవి మొదలైంది. పగలే కాదు.. రాత్రుళ్లు కూడా వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉక్కపోత, చెమట, గాలి లేకపోవడం వంటివి నిద్రను దూరం చేస్తాయి. అందుకే చాలామంది వేసవిలో ఏసీని వినియోగిస్తూ ఉంటారు. కానీ కొందరికి ఏసీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటివారికి ఇలాంటి వాతావరణంలో నిద్ర అనేది అందని ద్రాక్షగా మారుతుంది. వేడి వల్ల నిద్ర పట్టదు. అయితే ఏసీ లేకున్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల సమ్మర్లో కూల్​గా నిద్రపోవచ్చు. వాటిని ఫాలో అయితే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా హాయిగా డీప్ స్లీప్ వేయొచ్చు. ఆ చిట్కాలు ఏంటంటే.. 

గదిని చల్లగా ఉంచేందుకు..

రాత్రుళ్లు రూమ్ చల్లగా ఉండాలంటే.. పగలే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డే టైమ్లో గదిలోకి ఎక్కువ వేడి రాకుండా కర్టెన్లు మూసి ఉంచాలి. అలాగే రాత్రి గాలి కాస్త చల్లగా మారిన తర్వాత కిటికీలు తెరిస్తే గది కూల్ అవుతుంది.

పడుకునే ముందు స్నానం

రాత్రి నిద్రకు ముందు.. గోరువెచ్చని లేదా కొద్దిగా చల్లని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి నిద్ర సులభంగా పడుతుంది.

బెడ్‌షీట్ ఎంపిక

సమ్మర్లో బెడ్ షీట్​గా కొన్ని రకాలు ఎంచుకోకూడదు. సిల్క్ కలిసిన బెడ్​షీట్స్ మరింత వేడిని పెంచుతాయి. కాబట్టి కాటన్ బెడ్‌షీట్లు, లైట్ కలర్స్ ఉపయోగిస్తే మంచిది. ఇవి వేడిని తగ్గిస్తాయి.

నీరు తాగండి

డీహైడ్రేషన్ పెరిగితే శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి పడుకునే ముందు కొంచెం నీరు తాగడం వల్ల కూల్‌గా ఉంటుంది. మరి ఎక్కువ తాగితే వాష్ రూమ్​ కోసం లేవాల్సి వస్తుంది. 

ఫ్యాన్ వేసుకున్నప్పుడు..

రాత్రుళ్లు ఫ్యాన్ వేసుకున్నప్పుడు.. ఒక బౌల్‌లో ఐస్ క్యూబ్స్ లేదా చల్లని నీరు పెట్టండి. దీనివల్ల గాలి మరింత చల్లగా అనిపిస్తుంది. వేడి తగ్గుతుంది. మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

దుస్తులు విషయంలో.. 

రాత్రుళ్లు టైట్​గా, డార్క్ కలర్ డ్రెస్​లు వేసుకోకపోవడం మంచిది. లూజ్‌గా, కాటన్ బట్టలు వేసుకుంటే చెమట తగ్గి కంఫర్ట్‌గా ఉంటుంది.

రిలాక్స్ అవ్వండి

మొబైల్, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టి.. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి నిద్రకు సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గి.. శరీరంలో వేడి అదుపులో ఉంటుంది. దీనివల్ల మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. 

కూలింగ్ డ్రింక్స్ 

కూలింగ్ డ్రింక్స్ అంటే చాలామంది కూల్ డ్రింక్స్ అనుకుంటారు. అస్సలు కాదు. శరీరంలో వేడిని తగ్గించే మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి కూలింగ్ డ్రింక్స్ తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గిస్తాయి. 

వెంటిలేషన్

క్రాస్ వెంటిలేషన్ ఉండేలా తలుపులు, కిటికీలు ఓపెన్ చేయండి. దీనివల్ల వేడి గాలి లోపలే ఉండకుండా ఫ్రెష్ గాలి లోపలికి వస్తుంది. 

కాళ్లు కడుక్కోవాలి.. 

పడుకునే ముందు కాళ్లను చల్లని నీటితో కడిగితే శరీరం మొత్తం కూల్ అవుతుంది. దీనివల్ల వేడి తగ్గి.. హాయిగా నిద్ర పట్టవచ్చు. 

మొత్తానికి ఏసీ లేకపోయినా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వేసవిలో కూడా హాయిగా నిద్రపోవచ్చు. మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి ఈ అలవాట్లను మీ డైలీ రూటీన్‌లో చేర్చుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget