అన్వేషించండి

Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Sleeping Right After Dinner : రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ అలవాటు వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. మరి భోజనం చేసిన తర్వాత ఎంతసేపటికి నిద్రపోవాలి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆలస్యంగా భోజనం చేసి వెంటనే పడుకుంటే జీర్ణ సమస్యలు.
  • యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తాయి.
  • నిద్రకు ఆటంకం, బరువు పెరిగి మధుమేహంపై ప్రభావం.
  • భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల విరామం ముఖ్యం.

Late Night Eating and Digestion Risks : రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం.. తిన్న వెంటనే పడుకోవడం చాలామందికి అలవాటు. పని ఒత్తిడి, ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం వంటి కారణాలతో కొందరు తొమ్మిది తర్వాత భోజనం చేస్తుంటారు. వెంటనే రిలాక్స్ అవ్వాలని పడుకుంటారు. ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం రెగ్యులర్​గా జరిగితే జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్​లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ, ల్యాపరోస్కోపిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ వెంకటేష్ శ్రీపతి ఈ అంశం గురించి పలు విషయాలు వివరించారు. డాక్టర్ వెంకటేష్ ప్రకారం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల అవకాశం పెరుగుతుంది. మరి రాత్రి భోజనం చేసిన తర్వాత ఎంత సమయానికి నిద్రపోవాలి? ఆలస్యంగా తినడం వల్ల కలిగే ఇబ్బందులేంటో తెలుసుకుందాం.

Also Read : అన్నానికి బదులుగా డిన్నర్​లో ఇవి తినండి.. కడుపు నిండటంతో పాటు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి

యాసిడ్ రిఫ్లక్స్ 

భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల కడుపులోని యాసిడ్స్ తిరిగి అన్నవాహికలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల గుండెల్లో మంట, గొంతులో పుల్లటి రుచి, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండొచ్చు.

భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొంతసేపు నిటారుగా కూర్చోవాలి లేదా నెమ్మదిగా నడవాలి. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వచ్చే ప్రమాదం తగ్గించేందుకు భోజనానికి, నిద్రకు మధ్య తగిన విరామం ఇవ్వడం ముఖ్యం.

Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

కడుపు ఉబ్బరం, అజీర్ణం

రాత్రి సమయంలో ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, నూనెలో వేయించిన, మసాలా ఫుడ్స్ తినడం వల్ల కొందరిలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు బరువుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. అలా తిని భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల ఈ అసౌకర్యం మరింత ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి రాత్రుళ్లు ఎక్కువగా, హెవీ మీల్స్ తినడం కంటే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

రాత్రి భోజనంలో వేయించిన పదార్థాలు, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు, మంటను పెంచే మసాలా పదార్థాలను తగ్గించాలి. ప్రతి ఒక్కరికీ ఈ ఫుడ్స్ సమస్య కలిగించకపోవచ్చు. కాబట్టి మీ శరీరాన్ని బట్టి ఏ పదార్థాలు తిన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందో గుర్తించి వాటిని కంట్రోల్ చేయాలి. 

Also Read : తప్పులు చిన్నవే ఆరోగ్య సమస్యలు మాత్రం పెద్దవి.. బ్రేక్​ఫాస్ట్​తో మధుమేహం, డిన్నర్​తో బరువు, జాగ్రత్త

నిద్రకు ఆటంకం

రాత్రి భోజనం చేసిన తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వస్తే నిద్ర మధ్యలో మెలకువ రావచ్చు. నిద్ర నాణ్యత తగ్గడంతో మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీటివల్ల జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి. 

నిద్రపోయే సమయానికి దగ్గరగా భారీ భోజనం చేయకూడదు. తరచూ రాత్రిపూట గుండెల్లో మంటతో నిద్ర లేస్తుంటే దానిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

Also Read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. డిన్నర్ 8 గంటలలోపే ముగిసిపోవాలట, ఎందుకంటే

మధుమేహంపై ప్రభావం

ఒక అధ్యయనంలో 12 మందిని పరిశీలించగా.. సాయంత్రం 6 గంటలకు బదులుగా రాత్రి 11 గంటలకు భోజనం చేసినప్పుడు మరుసటి రోజు అల్పాహారం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ అధ్యయనం చాలా చిన్నది. కాబట్టి దీని ఆధారంగా ప్రతి ఒక్కరిలోనూ ఇదే ప్రభావం ఉంటుందని చెప్పలేం.

కాబట్టి ప్రతిరోజూ అర్ధరాత్రి సమీపంలో భారీ భోజనం చేసే అలవాటు ఉంటే దాన్ని మార్చుకోవడం మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు భోజన సమయాలు, ఆహార పరిమాణంపై వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సూచనలు పాటించాలి.

Also Read : బరువు తగ్గడానికి రాత్రుళ్లు డిన్నర్ మానేస్తున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

బరువు పెరగవచ్చు

బరువు పెరగడంలో రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీలు, శారీరక శ్రమ, నిద్ర, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే రాత్రుళ్లు తరచుగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటే.. కేలరీల మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇలాంటి అలవాట్లు జీవక్రియల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

బరువు తగ్గేందుకు రాత్రి భోజనం మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, తగిన ప్రోటీన్, ధాన్యాలు ఉండేలా భోజనం చేసుకోవాలి. భోజనం చేసిన సమయం ఒక్కటే బరువు పెరుగుదలను నిర్ణయించదని గుర్తించాలి.

Also Read : రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. డిన్నర్ 8 గంటలలోపే ముగిసిపోవాలట, ఎందుకంటే

భోజనం తర్వాత ఎంతసేపటికి నిద్రపోవాలి?

సాధారణంగా రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల విరామం ఇవ్వడం మంచిది. ఈ సమయంలో కడుపులోని ఆహారం కొంతవరకు ముందుకు కదిలేందుకు సమయం లభిస్తుంది. అలాగే పడుకున్నప్పుడు యాసిడ్స్ అన్నవాహికలోకి తిరిగి వచ్చే ప్రమాదం తగ్గవచ్చు. తరచుగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు తమ లక్షణాలను బట్టి వైద్య సహాయం తీసుకోవాలి. 

డాక్టర్ వెంకటేష్ ప్రకారం.. వీలైనంత వరకు ప్రతిరోజూ ఒకే సమయానికి రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించాలి. నిద్రపోయే సమయానికి అనుగుణంగా భోజన సమయాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. పని కారణంగా ఆలస్యమైతే పెద్ద భోజనం చేయకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. 

Also Read : బరువు తగ్గాలనుకుంటే డిన్నర్​లో ఈ మిస్టేక్స్ చేయకపోవడమే మంచిది.. లేదంటే ఇట్టే పెరిగిపోతారట

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget