అన్వేషించండి

Skipping Dinner : బరువు తగ్గడానికి రాత్రుళ్లు డిన్నర్ మానేస్తున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే

Weight Loss: బరువు తగ్గేందుకు చాలామంది చేసే సింపుల్ పని ఏంటంటే తినడం మానేయడం. ముఖ్యంగా డిన్నర్ మానేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని లాభాలున్నా దీర్ఘకాలిక నష్టాలున్నాయంటున్నారు. అవేంటంటే..

Positive and Negative Effects of Skipping Dinner : నేను నైట్ డిన్నర్​ చేయను. ఈ మాటను చాలామంది దగ్గర వినే ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఎంచుకుంటారు. దీనివల్ల కొన్ని లాభాలు ఎలా ఉన్నాయో.. అలాగే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు నిపుణులు. మీరు కూడా రాత్రుళ్లు డిన్నర్ మానేయాలనుకున్నా.. లేక ఇప్పటికే మానేసినా లేట్ అయ్యిందేమి లేదు. ఇప్పటికైనా ఈ విషయాలు తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. 

లాభాలివే

బరువు తగ్గడం : రాత్రుళ్లు డిన్నర్ మానేయడం వల్ల కచ్చితంగా బరువులో మార్పులు ఉంటాయి. బరువు తగ్గుతారు. కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది కాబట్టి.. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్​ అనే చెప్పొచ్చు. 

మధుమేహం : ఫాస్టింగ్ చేయడం లేదా భోజనం చేయడం మానేయడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. టైప్​ 2 డయాబెటిస్​ని మ్యానేజ్ చేయడానికి లేదా దూరం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. 

ఆటోఫాగి : దెబ్బతిన్న కణాలు, ప్రోటీన్​లను రీసైకిల్ చేసే ప్రక్రియను ఆటోఫాగి అంటారు. డిన్నర్ మానేస్తే దీనిని శరీరం అలవాటు చేసుకుంటుంది. 

నష్టాలివే.. 

పోషకాహార లోపం : డిన్నర్ మానేయడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు రోజులో సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. శరీరానికి పోషకాలు అందవు. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

బ్లడ్ షుగర్ : రాత్రుళ్లు డిన్నర్ చేయడం మానేస్తే రక్తంలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. దీనివల్ల కళ్లు తిరగడం, ఫటిగో, ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. 

మెటబాలీజం :  రాత్రి భోజనం మానేస్తే మెటబాలీజం తగ్గుతుంది. జీవక్రియ తగ్గితే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. మొదట్లో బరువు తగ్గినట్లు అనిపించినా.. తర్వాతి రోజుల్లో ఊహించని రీతిలో బరువు పెరిగే అవకాశముంది. 

నిద్రలో మార్పులు : రాత్రుళ్లు భోజనం మానేయడం వల్ల నిద్ర తక్కువ అవుతుంది. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. 

కండర బలం : వయసు పెరిగే కొద్ది కండర బలం తగ్గుతుంది. అయితే రాత్రుళ్లు డిన్నర్ మానేయడం వల్ల కూడా ఇది తగ్గే అవకాశముంది. దీనివల్ల బరువు తగ్గిన ఫీల్ వస్తుంది కానీ.. ఫ్యూచర్​లో కండరాల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇవేకాకుండా గ్యాస్ సమస్యు, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. దీనివల్ల ముఖంలో మెరుపు తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు రాలుతుంది. 

ఎవరూ అవాయిడ్ చేయాలంటే.. 

పిల్లలు, టీనేజర్స్ దీనికి దూరంగా ఉండాలి. లేదంటే వారి ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు కూడా డిన్నర్​ని స్కిప్​ చేయకపోవడమే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు షుగర్​ లెవెల్స్​ని మ్యానేజ్ చేయడానికి రెగ్యులర్​ మీల్స్ చేయొచ్చు. 

బరువు తగ్గేందుకు ఇలా ట్రై చేయండి..

బ్యాలెన్స్డ్ డిన్నర్ : తినడం మానేయడం కంటే తీసుకునే ఆహారంపై ఫోకస్ చేయండి. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతూ హెల్తీగా ఉంటారు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందిస్తూ.. హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటూ.. కార్బ్స్ అందిస్తే మంచిది. 

పోర్షన్ కంట్రోల్ : రెగ్యులర్​గా తీసుకునే ఆహారం కంటే కంట్రోల్​గా, శరీరానికి ఎన్ని కేలరీలు అవసరమో అంతే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది. 

హెల్తీ స్నాక్స్ :  మీ డైట్​లో హెల్తీ స్నాక్స్​ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఎక్కువ తినడం కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. 

ఒకవేళ మీరు ఇతర కారణాలతో డిన్నర్​ మానేయాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా బరువు తగ్గుతారు. 

Also Read : స్ట్రెస్ ఎక్కువైతే థైరాయిడ్ తప్పదట.. ఒత్తిడితో ఉన్న లింక్ ఇదే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Roti Pizza Recipe: మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
మిగిలిపోయిన రొట్టెను పారేయొద్దు! 5 నిమిషాల్లో పిజ్జాను తయారు చేసుకోవచ్చు! 
Mughlai Chicken Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో మొఘలాయ్ చికెన్ ఇంట్లో తయారు చేయడానికి ఏమేంకావాలి? రెసిపీ ఏంటీ? 
రెస్టారెంట్ స్టైల్‌లో మొఘలాయ్ చికెన్ ఇంట్లో తయారు చేయడానికి ఏమేంకావాలి? రెసిపీ ఏంటీ? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Embed widget