సైక్లింగ్ మీ రొటీన్​లో చేర్చుకుంటే శారీరక, మానసిక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

రోజూ సైకిల్​ తొక్కితే గుండె, లంగ్స్ ఆరోగ్యానికి మంచిది. కార్డియోవాస్కులర్ సమస్యలు రావు.

బరువు తగ్గడంలో, సరైన బరువును మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది. శక్తిని పెంచుతుంది. ఎనర్జిటిక్​గా ఉంటారు.

కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది. కండరాలు బలపడతాయి.

ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేసే ఎండార్ఫిన్స్​ను రిలీజ్ చేసి ప్రశాంతతను అందిస్తుంది.

మెరుగైన నిద్రను అందించడంతో పాటు నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. మొత్తం మూడ్​ని మెరుగుపరుస్తుంది.

మతిమరుపు సమస్యలను దూరం చేస్తుంది. వయసు ద్వారా వచ్చే లోపాలను సరిచేస్తుంది.

సైకిల్ తొక్కడం వల్ల ప్రొడెక్టివిటీ, క్రియేటివిటీ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. ఆరోగ్య సమస్యలుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.