Health Benefits of Early Dinner : బరువు తగ్గాలనుకుంటే రాత్రి ఏడు గంటలకు ముందే డిన్నర్ ఫినిష్ చేసేయాలట.. నిపుణులు ఏమంటున్నారంటే
Early Dinner Benefits : ప్రతిరోజూ రాత్రి ఏడు గంటలకు ముందు రాత్రి భోజనం చేయాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు.. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇది ఫాలో అవ్వమంటున్నారు.
Dinner Timings for Weight Loss : రోజులో చివరి భోజనం రాత్రి ఏడు గంటలలోపు చేయాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. రాత్రులు ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరుగుతారని శాస్త్రవేత్తలు గుర్తించారు. డిన్నర్ లేట్‌గా చేయడం వల్ల రాత్రి భోజనం రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతాయని.. అవి వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు. అందుకే రాత్రి భోజనం వీలైనంత త్వరగా.. ఏడు గంటలలోపు ముగించాలని సూచిస్తున్నారు.
డిన్నర్ ఏ టైమ్‌లో చేస్తుందనే దానిపై చేసిన ఈ పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించారు. రాత్రి ఏడుగంటలలోపు డిన్నర్ ముగిస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. అయితే ఇది మొత్తం ఆహారంలో ఓ అంశం మాత్రమేనని.. రోజంతా మీరు ఏమితింటున్నారు.. భోజనం, స్నాక్స్‌లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారనేది కూడా బరువుపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అయితే రాత్రి 7 గంటలలోపు డిన్నర్ ముగించేయడం వల్ల అది జీవనశైలి, ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అవేంటంటే..
నిద్ర నాణ్యత మెరుగవుతుంది
మీకు నిద్ర సమస్యలుంటే కచ్చితంగా సాయంత్రం ఏడులోపు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మంచిది. నిద్రపోయే ముందు ఫుడ్ తినడం వల్ల అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు కలుగుతాయి. ఇది మీకు నిద్రకు భంగం కలిగిస్తుంది. ముందుగానే ఫుడ్ తినడం వల్ల త్వరగా జీర్ణమై.. మంచి నిద్రను ఇస్తుంది. రెగ్యూలర్‌గా ఇది ఫాలో అయితే నిద్ర నాణ్యతను పెంచుతుంది.
సిర్కాడియన్ రిథమ్
శరీరంలో వివిధ విధులను నియంత్రించే సిర్కాడియన్ రిథమ్పై ఆధారపడి ఉంటాయి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను ఆప్టిమైజ్ చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. త్వరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అధిక ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది. ఎర్లీ డిన్నర్ హెల్తీ గట్ను ఇస్తుంది.
షుగర్ కంట్రోల్
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఈ పద్ధతి హెల్ప్ చేస్తుంది. రాత్రి భోజనం 7లోపు ముగించేస్తే.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీర కణాలు ఇన్సులిన్‌కు మరింత ప్రతిస్పందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత ప్రభావవంతంగా నియంత్రిస్తాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలలో వేగవంతమైన అధిక హెచ్చుతగ్గులను నిరోధిస్తుంది. ఇది మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు మద్ధతు ఇస్తుంది.
గుండె ఆరోగ్యానికై..
రాత్రుళ్లు లేట్‌గా డిన్నర్ చేయడం, అధిక కేలరీలు, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఏడులోపు భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫ్యాట్, ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోకపోతే గుండె ఆరోగ్యానికి మరీ మంచిది.
అయితే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు డిన్నర్ ముగించాలని నిపుణులు చెప్తున్నారు. ఇవి మెరుగైన జీర్ణక్రియలో సహాయం చేస్తాయంటున్నారు. డిన్నర్ చేసిన తర్వాత ఓ 20 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిదని చెప్తున్నారు. నిద్రవేళకు ముందు తినడం వల్ల అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం వంటివి కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే.. అది మరిన్ని అనారోగ్య సమస్యలు ఇస్తుంది. కాబట్టి ఏడుగంటల ముందు ఫుడ్ తీసుకున్నా.. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు.
Also Read : అతని వయసు 61.. కానీ బయోలాజికల్ ఏజ్ 30ల్లోనే ఉంది.. అది ఎలా సాధ్యమైందంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.