498A: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
Atul Subhash Like People: ఆత్మహత్య చేసుకోకుండా ఉన్న అతుల్ సుభాష్ లాంటి బాధితుల వేదన ఎవరికీ పట్టదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తన సోదరుడి దుస్థితిపై ఓ తెలుగు అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది.
No one cares about the pain of victims like Atul Subhash : బెంగళూరులో అతుల్ సుభాష్ అనే టెకీ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గృహహింస కేసుల్లో ఏకపక్షంగా మగవాళ్లదే తప్పు అన్నట్లుగా ఉన్న చట్టాలు, అలాంటి చట్టాలను ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆడవాళ్ల వల్ల బలి అయిపోతున్న కుటుంబాల గురించి ఎవరూ పట్టించుకోరా అన్న ప్రశ్న వస్తోంది. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయనపై తప్పుడు కేసుుల పెట్టిన భార్యను అరెస్టు చేశారు. కానీ అలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్నారని వారు ఆత్మహత్యలు చేసుకుంటేనే పట్టించుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ డిబేట్ జరుగుతూండగానే ఢిలీల్లీలో ఓ బేకరీ యజమాని విడాకుల కోసం కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కూడా చర్చనీయాంశమయింది.
అయితే ఈ 498A కేసుల బారిన పడిన కుటుంబాల వెతలు అన్నీ ఇన్నీ కావు. కేవలం తమకు చట్టాలు ఇచ్చిన వెసులుబాటును ఆసరా చేసుకుని కొంత మంది మహిళలు బ్లాక్ మెయిలింగ్‌కు డబ్బు కోసం.. మనో వర్తి కోసం ఈ కేసులు పెడుతున్నారు. పోలీసులు కూడా ఈ కేసుల్లో ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది చూడటం లేదు. మొదట కేసు నమోదు చేస్తున్నారు. అది క్రిమిల్ కేసులు కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ఇలాంటి వారు బయటకు రాలేకపోతున్నారు. జీవితంలో ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. ఇలాంటి ఓ కుటుంబానికి చెందిన యువతి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోది. ఆ యువతి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు.
హైదరాబాద్ సిటీకి చెందిన ఆ యువతి ఉన్నత విద్యావంతురాలు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఐఐటీ, ఐఐఎమ్ నుంచి ఉన్నత చదువులు అభ్యసించారు. ఎంతో ప్రతిభావంతురాలైన ఆమెకు ఉద్యోగావకాశాలు రావడం లేదు. ఎందుకంటే.. తన సోదరుడు భార్య పెట్టిన 498A కేసు వల్ల.
అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న తన సోదరుడి వివాహాన్ని ఓ మ్యాట్రిమొనియల్ సైట్ ద్వారా ఓ మహిళతో ఖరారు చేశారు. అన్నీ మాట్లాడుకుని పెళ్లి చేశారు. అయితే పెళ్లి అయిన పది రోజులకే ఆ మహిళ భర్తను వదిలేసి వెళ్లిపోయింది. ఈ పది రోజులు అత్తగారింట్లో అందరితోనూ మిస్ బిహేవ్ చేసింది. ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయి 498A కేసు నమోదు చేసింది. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తోంది. కోర్టులోనే తేల్చుకుందామని ఆ కుటుంబం వాయిదాలకు హాజరవుతోంది. ఇప్పటిక్ పదుల సంఖ్యలో విచారణకు కోర్టుకు వెళ్లినా .. అసలు ఫిర్యాదిదారు అయిన మహిళ మాత్రం రావడం లేదు. ఇప్పటికి ఐదేళ్లు అయిపోయింది. ఆమె కోర్టుకు హాజరు కాని కారణంగా విచారణ జరగడం లేదు. కానీ క్రిమినల్ కేసులో ఇరుక్కున్న కుటుంబం మాత్రం అన్ని రకాల అవమానాలను ఎదుర్కోంటోంది. ఆమె చేసిన ఆరోపణలు నిజం అయితే తమను శిక్షించాలని. లేకపోతే తమకు విముక్తి కలిగించాలని.. ఇంకా ఎంత కాలం ఇలా వాయిదాలు వేస్తారని ఆ యువతి ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు రాకపోతే ఏమీ అనరని..కానీ నిందితులుగా ఉన్న వారు కోర్టుకు రాకపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఐదేళ్లలో కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి వచ్చిందని.. ఇప్పటికీ తన సోదరుడు సొంత కుటుంబాన్ని ప్రారంభించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
She is an IIT-IIM graduate and has lost job opportunities due to the 498A case filed against her brother, her, and her parents. It has been five years.
— Joker of India (@JokerOf_India) January 9, 2025
You toxic feminists, look here: fake cases destroy women too.#ToxicFeminism pic.twitter.com/AzHbQiqr0j
కుట్రపూరితంగా 498Aను ఉపయోగించుకుని డబ్బులు గుంజాలనుకునే మహిళల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని అని హైదరాబాద్ యువతి ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిశీలన చేయాలని కోరుతున్నారు. చట్టాలన్నీ సమానంగా ఉండాలని అటున్నారు. కేసు పెట్టిన మహిళ.. విచారణకు రాకపోయినా హాయిగా ఉన్నారని.. కానీ ఏ పాపం తెలియని నిందితులు మాత్రం క్రిమినల్ కేస్ రికార్డుతో అవమానాలకు గురవుతున్నారని.. వ్యక్తిగతంగా.. ఉద్యోగ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు ?. ఈ యువతి అడిగే ప్రశ్నలకు వ్యవస్థల వద్ద సమాధానం ఉందా ?