అన్వేషించండి
Vaikunta Dwara Darshanam: అల 'వైకుంఠ'వాసుని వైకుంఠ ద్వార దర్శనం - చూసిన కనులకు మహాభాగ్యం, ఇల వైకుంఠ శోభను చూశారా?
Tirumala Temple: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇల వైకుంఠ ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ
1/14

తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకుంది. పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
2/14

అభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 గంటల నుంచే అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే స్వామి దర్శనం కల్పించారు.
3/14

టోకెన్ ఉన్న భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబంతో సహా స్వామిని దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు.
4/14

ఆలయం వెలుపల విద్యుత్ దీపాలంకరణ వైకుంఠ శోభను తలపించింది. విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీవారి ఆలయం ఇల వైకుంఠమే అన్నట్లుగా మారింది.
5/14

విద్యుత్ దీపాలంకరణలతో పాటు బెంగుళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆలయం, వైకుంఠ ద్వారం సహా అంతరాలయం వెలుపల ప్రత్యేక పుష్పాల అలంకరణలు అద్భుతాన్ని ఆవిష్కరించాయి.
6/14

ఆలయం వెలుపల పుష్పాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుష్పాల అలంకరణతో పాటు విద్యుత్ దీపాల వెలుగులతో శ్రీవారి ఆలయం మరింత శోభను సంతరించుకుంది.
7/14

ఆలయం వెలుపల వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని చూసిన భక్తులు మురిసిపోతున్నారు. అభిషేకం అనంతరం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించారు.
8/14

ఆలయం వెలుపల పుష్పాలతో ప్రత్యేక వైకుంఠం అబ్బుర పరుస్తోంది. నిజంగా వైకుంఠమే ఇలకు దిగి వచ్చిందా అన్న రీతిలో దీన్ని తీర్చిదిద్దారు.
9/14

పుష్పాల మధ్య అమ్మవారితో స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు తరిస్తున్నారు. ఇది నిజంగా వైకుంఠ దర్శనమే అంటూ మురిసిపోతున్నారు.
10/14

స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
11/14

తిరుమల ఆలయం వెలుపల సుందరంగా పుష్పాలతో అలంకరించారు. ఈ ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిజంగా ఇల వైకుంఠమే అనిపించేలా అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
12/14

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకరణలో మెరిసిపోతోంది. భిన్న రకాల్లో ఆలయాల రూపంలో చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి.
13/14

శుక్రవారం ఉదయం స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ పర్వదినం రోజున శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రంథంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
14/14

వైకుంఠ ఏకాదశి దర్శనం సందర్భంగా 3 రోజులు పుష్పాలంకరణతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను అలరించనుంది. పుష్పాల మధ్య శ్రీనివాసుని దర్శనం భక్తులకు మరో అనుభూతిని కలిగిస్తోంది.
Published at : 10 Jan 2025 08:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion