Brahma Anandam OTT Release Date: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?, వాళ్లు ముందే చూసెయ్యొచ్చు..
Brahma Anandam OTT Platform: హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మా ఆనందం'. ఈ మూవీ ఈ నెల 20 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

Raja Goutham's Brahma Anandam Movie OTT Release On Aha: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రహ్మా ఆనందం' (Brahma Anandam). తండ్రీ కొడుకులే తాతా మనవళ్లుగా నటించి మెప్పించారు. గత నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, యాక్టింగ్ ప్రేక్షకులను అలరించింది.
ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్
'బ్రహ్మా ఆనందం' మూవీ ఈ నెల 20 నుంచి 'ఆహా' (Aha) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా 'ఆహా' ప్రకటించింది. ‘మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు Rvs నిఖిల్ దర్శకత్వం వహించారు. సక్సెస్ ఫుల్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీలో బ్రహ్మానందం, రాజాగౌతమ్‌తో పాటు ప్రియా వడ్లమాని, వెన్నెల కిశోర్, దివిజ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి కీలక పాత్రలు పోషించారు.
చిన్న ట్విస్ట్..
అయితే.. 'ఆహా' గోల్ట్ సబ్ స్క్రైబర్లు మాత్రం ఈ నెల 19 నుంచే సినిమా వీక్షించే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నార్మల్ సబ్ స్కైబర్స్ 20 నుంచి మూవీ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
Some stories make you smile and some touch your heart...Brahma Anandam does both 🥰#BrahmanandamonAha pic.twitter.com/VLpG6UltDj
— ahavideoin (@ahavideoIN) March 15, 2025
Also Read: మహేష్ బాబు - రాజమౌళి మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం బిగ్ అప్‌డేట్... షూటింగ్ లొకేషన్ లీక్
'బ్రహ్మా ఆనందం' స్టోరీ ఏంటంటే..?
బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి పూర్తి సెల్ఫిష్‌గా మారిపోతాడు. అయితే, చిన్నప్పటి నుంచే నాటకాలు, డ్రామాలంటే పిచ్చి. దీంతో థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తాడు. ఎప్పటికైనా పెద్ద యాక్టర్ కావాలనే లక్ష్యంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తన గురువు సాయంతో ఢిల్లీలోని కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే ఛాన్స్ అందిపుచ్చుకుంటాడు. అయితే, ఇందులో పాల్గొనాలంటే దాదాపు రూ.6 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, అన్నీ ప్రయత్నాలు చేసి డబ్బులు సర్దుబాటు కాక ఇబ్బంది పడతాడు బ్రహ్మ. దీంతో నిరాశకు గురవతుండగా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉన్న తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన పేరు మీద 6 ఎకరాల భూమి ఉందని.. తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని చెప్పి బ్రహ్మను తన ఊరికి తీసుకెళ్తాడు.
తన స్వార్థంతో తన ప్రేయసిని (ప్రియా వడ్లమాని) దూరం చేసుకుంటాడు బ్రహ్మ. అతనికి జీవితంలో అన్ని విధాలుగా తోడుంటాడు స్నేహితుడు గిరి (వెన్నెల కిశోర్). అసలు భూమి ఇవ్వడానికి బ్రహ్మకు రామ్మూర్తి పెట్టిన కండిషన్ ఏంటి.?, మూర్తి వృద్ధాశ్రమంలోనే ఉండిపోవడానికి గల కారణాలేంటి..?, డబ్బు కట్టి బ్రహ్మ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా.?, అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.





















