Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Varanasi Importance In SSMB29: కాశీలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కలయికలోని సినిమా సన్నివేశాలు కొన్ని ఉంటాయని తెలిసింది. అయితే ప్రభాస్ సినిమాకు భిన్నంగా రాజమౌళి సినిమా ఉండబోతుందట.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథాలజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడి' గుర్తు ఉందా? అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కాశీ నేపథ్యంలో తీసిన సినిమా అది. భవిష్యత్తులో, వంద ఏళ్ల తర్వాత కాశీ ఎలా ఉండబోతుందనేది ఊహించి దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించారు. అందుకు భిన్నంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన సినిమా తీస్తున్నారట.
కాశీ (వారణాసి) చరిత్రను ఆవిష్కరించేలా...
భారతీయ పురాణాల గొప్పదనం చెప్పేలా!!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి ఒక పాన్ వరల్డ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ వారణాసి (కాశీ) నేపథ్యంలో కథ, సన్నివేశాలు సాగుతాయని కొన్ని రోజుల క్రితమే యూనిట్ నుంచి లీకులు వచ్చాయి. అయితే... ప్రభాస్ సినిమాలో కాశీతో కంపేర్ చేస్తే మహేష్ - రాజమౌళి (Mahesh - Rajamouli Movie) సినిమాలో కాశీ చాలా భిన్నంగా ఉంటుందట.
భారతీయ చరిత్రలో ముఖ్యంగా హైందవ సంస్కృతిలో వారణాసి నగరానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇప్పటికీ ఎంతో మంది హిందువులు వారణాసిలో తుది శ్వాస విడవడం కోసం తమ చివరి రోజుల్లో అక్కడికి వెళ్తారు. ఆ చరిత్ర అంతటని రాజమౌళి తన సినిమాలో చూపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ సినిమాగా SSMB29ని రూపొందిస్తున్నామని కొన్ని రోజుల క్రితం రాజమౌళి వెల్లడించారు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని లీక్స్ వస్తున్నాయి. కొండల్లో, లోయల్లో, అడవుల్లో, నదుల్లో... ప్రపంచంలో ప్రాముఖ్యమైన లొకేషన్లలో సినిమా షూటింగ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. దర్శక ధీరుడి ప్లానింగ్ చూస్తుంటే... కథ ఏమై ఉంటుందని అభిమానులతో పాటు ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.
మహేష్ బాబు కోసం భాగ్యనగరంలో కాశీ!
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరోని వారణాసి తీసుకువెళ్లే షూటింగ్ చేయడం కష్టం కనుక హైదరాబాద్ సిటీలో కాశి నగరాన్ని క్రియేట్ చేయబోతున్నారు రాజమౌళి. ఆల్రెడీ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఒరిస్సాలోని కొండ ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల అక్కడ షూటింగ్ లోకేషన్ నుంచి తీసిన వీడియోలు లీక్ కావడంతో సెక్యూరిటీ మరింత పెంచారు. ఒరిస్సా షెడ్యూల్ పూర్తి అయ్యాక హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ కావచ్చు అని సమాచారం.
Also Read: 'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!
మహేష్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినబడుతోంది. ఇందులో మలయాళ కథానాయకుడు - దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్. అయితే ఆవిడది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని... మహేష్ బాబు సరసన మరొక హీరోయిన్ కనిపిస్తారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ఖర్చుకు వినపడకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

