అన్వేషించండి

SSMB29 Leaked Video: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు లీకుల బెడద... సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు

SSMB29 Shooting Location: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు లీకుల బెడద మొదలైంది. ఒరిస్సా షెడ్యూల్ షూట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒరిస్సా తీసుకు వెళ్లారు. SSBM29 షూటింగ్ చేస్తున్నారు. ఓపెన్ లొకేషన్ కావడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

మహేష్... రాజమౌళి సినిమాకు లీకుల బెడద!
స్టార్ హీరోలతో ఓపెన్ డోర్ లోకేషన్లలో షూటింగ్ చేయడం చాలా కష్టం అని మరోసారి మహేష్ - రాజమౌళి సినిమా (Mahesh Rajamouli Movie)తో అందరికీ అర్థం అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' చిత్రీకరణ గోదావరిఖనిలో జరిగింది. అక్కడ ఫోటోలు,‌ వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ మహేష్ - రాజమౌళి సినిమా ఒరిస్సా షెడ్యూల్ నుంచి వీడియో లీక్ అయ్యింది.

సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు!
రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ సినిమాలో మహేష్ బాబు హీరో కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ అందరి కంటే ముందు తెలుసుకోవాలని అభిమానులతో పాటు ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కొంత మంది అత్యుత్సాహంతో లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఆ వీడియో గనుక షేర్ చేశారా అంతే సంగతులు... అకౌంట్స్ లేచిపోతాయి. కాపీ రైట్ యాక్ట్ కింద మహేష్  రాజమౌళి సినిమా యూనిట్ కేసు వేసే అవకాశం ఉంది. సినిమా ఓపెనింగ్ వీడియో కాదు కదా, కనీసం ఫోటో కూడా రాజమౌళి బయటకు రానివ్వలేదు. ఈ తరుణంలో ఏకంగా షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో లీక్డ్ కావడం అనేది పెద్ద షాక్ అని చెప్పాలి.

మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా!
ఒరిస్సా షెడ్యూల్ చిత్రీకరణకు రాజమౌళితో పాటు ఈ సినిమాలో విలన్ చేస్తున్న మలయాళ కథానాయకుడు - దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి మీద చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటున్నారని తెలిసింది.

Also Readమళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కే ఎల్ నారాయణ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు...' పాటకు  ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో రాజమౌళి సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి చూపు పడుతుంది వాటిని దృష్టిలో పెట్టుకుని ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించేందుకు ఆయన రెడీ అయ్యారు.

Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget