అన్వేషించండి

Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్

Chinni Serial Today Episode: స్టార్ మా సీరియల్ 'చిన్ని'లో కావ్య శ్రీ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులోకి నిఖిల్ మలియక్కల్ కూడా జాయిన్ అయ్యారు. 

బుల్లితెరపై సూపర్ హిట్ జోడీలలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal), అందమైన నటి కావ్య శ్రీ (Kavya Shree) జోడి ఒకటి. ఈ మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒక్క గూటికి చేరారు. 'చిన్ని' సీరియల్ చేస్తున్నారు.

'చిన్ని'లో నిఖిల్ ‌మలియక్కల్ క్యారెక్టర్ ఎంట్రీ!
Nikhil Maliyakkal joins Chinni Serial Cast: 'చిన్ని' సీరియల్ ఇప్పటి వరకు 216 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు (మార్చి 8, శనివారం) 216 ఎపిసోడ్ టెలికాస్ట్. ఎపిసోడ్ ఎండింగ్ చూస్తే నిఖిల్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది. 

'చిన్ని'లో కావ్య శ్రీ ఒక స్కూల్ టీచర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఆవిడ పిల్లలతో కలిసి ఆడుతుంటే నిఖిల్ కారులోంచి దిగాడు. బాల్ పట్టుకున్నాడు. మరి, వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయి? వాళ్ళిద్దరితో కలిసి దర్శక రచయితలు కలిసి ఆడే ఆట ఎలా ఉంటుంది? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. 

బ్రేకప్ తర్వాత నిఖిల్, కావ్య కలిసి...
నిఖిల్, కావ్య శ్రీ కలసి ఇంతకుముందు సీరియల్స్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీరియల్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండడం కూడా ఆ సీరియళ్లకు కలసి వచ్చింది. అయితే, ఇప్పుడు 'చిన్ని' సీరియల్ స్పెషాలిటీ ఏమిటంటే... బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సీరియల్ కావడం. 

'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి విజేతగా బయటకు వచ్చిన తర్వాత 'స్టార్ మా'లో ప్రసారం అయ్యే కొన్ని కార్యక్రమాలలో నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. అందులో కావ్య కూడా పాల్గొంది. మాజీ ప్రేమికులు మళ్లీ కలిసే అవకాశాలు తక్కువ అని ఆ కార్యక్రమాలలో ప్రవర్తనను బట్టి అర్థమయింది.

Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?

కావ్య శ్రీ నిజ జీవితంలో విలన్‌ను చూస్తున్నానని చెప్పడం కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. తనకు నిఖిల్ మీద నమ్మకం పోయింది అనే అర్థం వచ్చేలా కావ్య శ్రీ కొన్ని కార్యక్రమాలలో మాట్లాడారు. మాజీ లవ్ బర్డ్స్ మళ్ళీ ఒకే సీరియల్ చేస్తుండడం వల్ల ఏమైనా దగ్గర అవుతారేమో చూడాలి. 

డబుల్ రోల్ చేస్తున్న కావ్య... తన ఐటెంటిటీ దాచి!
'చిన్ని' సీరియల్ చూస్తే కావ్య శ్రీ క్యారెక్టర్ ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆవిడ డబుల్ రోల్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. జైలులో శిక్ష అనుభవించిన ఖైదీగా ఒక తల్లిగా ఆవిడను తొలుత చూపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఐడెంటిటీ దాచి కొత్త మనిషిగా కావ్య కనిపించారు. ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు బుల్లితెరకు 'గోరింటాకు' సీరియల్ ద్వారా పరిచయమైన కావ్య శ్రీ ఆ తర్వాత 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'గువ్వా గోరింక' వంటి సీరియల్స్ చేశారు. ఇప్పుడు 'చిన్ని' చేస్తున్నారు.

Also Readకయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget