Kayadu Lohar OTT Movie: కయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్
OTT Romantic Movie: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో తెలుగులోనూ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ కయాదు లోహర్. ఆవిడ నటించిన మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'తో తెలుగులోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ కయాదు లోహర్. ఈ అందాల భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. 'డ్రాగన్' కంటే ముందు జనవరిలో ఆవిడ నటించిన మలయాళ సినిమా ఒకటి థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
'ఒరు జాతి జాతకం'... రొమాంటిక్ కామెడీ!
Oru Jaathi Jathakam OTT Release Date Streaming Platform: మలయాళం నటుడు దర్శకుడు వినీత్ శ్రీనివాసం హీరోగా నటించిన సినిమా 'ఒరు జాతి జాతకం'. జనవరి 31న థియేటర్లలో విడుదల అయ్యింది. మార్చి 14వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్... రెండు ఓటీటీ వేదికలలో 'ఒరు జాతి జాతకం' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఒక కయాదు లోహర్ ఒక హీరోయిన్. నిఖిల విమల్ మరొక హీరోయిన్.
View this post on Instagram
LGBTQIA కమ్యూనిటీ మీద కొంతమంది చేసే వినోదం నేపథ్యంలో 'ఒరు జాతి జాతకం' సినిమా రూపొందింది. ఇదొక రొమాంటిక్ కామెడీ. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసే మలయాళ సినిమాలను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో అనువాదం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మాత్రం మలయాళంలోనే ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు.
View this post on Instagram
సుమారు 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన 'ఒరు జాతి జాతకం' సినిమా థియేటర్లలో 10 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అయితే 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' తెలుగు తమిళ భాషల్లో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 100 కోట్ల క్లబ్బులో చేరేందుకు రెడీ అయింది. ఆ సినిమాతో కయాదు లోహర్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వం వహించునున్న సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న సినిమాలలో అవకాశాలు అందుకుంది. తమిళంలోనూ మరో మూడు సినిమాలు, తెలుగులో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయని టాక్.
Also Read: విమెన్స్ డే స్పెషల్... మెగా మదర్ అంజనా దేవికి ఇష్టమైన సంతానం ఎవరో తెలుసా? చిరంజీవి ఏం చెప్పారంటే?





















