అన్వేషించండి

Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

Champion OTT Platform : యంగ్ హీరో రోషన్ మేక లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.

Roshan Meka's Champion Movie OTT Release Date : సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్'. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి తర్వాత ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మరోవైపు, ఈ మూవీ శాటిలైట్ రైట్స్ 'జీ తెలుగు' సొంతం చేసుకోగా... ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత టీవీల్లోకిి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా... రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ హీరో కల్యాణ్ చక్రవర్తి, అర్చన, కోవై సరళ, హర్షవర్దన్, నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరించగా... మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.

Also Read : భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

స్టోరీ ఏంటంటే?

1947 ఆగస్ట్ 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నిరంకుశ పాలనలో హైదరాబాద్ సంస్థానం మగ్గిపోతున్న కాలం. ప్రజలను బానిసలుగా చూస్తూ నిజాం ప్రభువులు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంటారు. రజాకార్ల క్రూరత్వానికి తెలంగాణలో పల్లెలన్నీ వణికిపోతుంటాయి. అయితే, భైరాన్పల్లి వాసులు మాత్రం రజాకార్లకు లొంగరు. వారిని ఎదిరించి వీరోచితంగా పోరాడుతూ అందరిలోనూ స్వాతంత్ర్య కాంక్ష రగిలిస్తుంటారు. ఇదే టైంలో సికింద్రాబాద్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ యువకుడు మైఖేల్ సి విలియమ్స్ (రోషన్) ఫుట్ బాల్ ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. తన టాలెంట్‌తో ఇంగ్లాండ్ మాంచెస్టర్ ఫుట్ బాల్ క్లబ్‌లో ఆడే ఛాన్స్ అందుకుంటాడు.

అయితే, మైఖేల్ తండ్రి నేపథ్యంతో అతను ఇంగ్లండ్ వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. దీంతో అక్రమ మార్గంలో ఆ దేశం వెళ్లాలని డిసైడ్ అయ్యి... విదేశాల నుంచి వచ్చిన ఆయుధాల్ని  హైదరాబాద్ నుంచి బీదర్‌కు చేర్చేందుకు ఒప్పుకొంటాడు. ఆ పని చేస్తున్న క్రమంలో దారి తప్పి భైరాన్పల్లి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? యుద్ధమంటే నచ్చని మైఖేల్ రజాకార్లతో ఎందుకు పోరాడాడు? రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించే బాబు దేశ్ ముఖ్ (సంతోష్ ప్రతాప్)కు మైఖేల్‌కు ఉన్న విరోధం ఏంటి? బైరాన్పల్లి వాసులకు నాయకుడిగా రాజి రెడ్డి (కల్యాణ్ చక్రవర్తి) ఏం చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hotspot 2 Much OTT : ఒకే రోజు 6 ఓటీటీల్లోకి తమిళ బోల్డ్ మూవీ - రిలీజైన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
ఒకే రోజు 6 ఓటీటీల్లోకి తమిళ బోల్డ్ మూవీ - రిలీజైన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
OTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... కానీ ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి వీటిదే
రవితేజ BMWపై సస్పెన్స్... కానీ ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి వీటిదే
Funky OTT : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon OTT : ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' బిగ్ ఓటీటీ డీల్! - టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్... కండీషన్స్ అప్లై
ఎన్టీఆర్, నీల్ 'డ్రాగన్' బిగ్ ఓటీటీ డీల్! - టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్... కండీషన్స్ అప్లై
Advertisement

వీడియోలు

Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
India broke Australia T20 World Cup Record | ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్
Pakistan Captain Salman comments on Ind vs Pak | ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్
India vs Pakistan T20 World Cup Highlights | పాక్‌ను చిత్తు చేసిన భారత్
India vs Pakistan T20 World Cup Ishan Kishan | యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bill Gates Amaravati Tour: ఆహా ఏమి పుణుగులు.. ఉండవల్లి పొలంలో లోకల్ ఫ్లేవర్ రుచి చూసిన బిల్ గేట్స్
ఆహా ఏమి పుణుగులు.. ఉండవల్లి పొలంలో లోకల్ ఫ్లేవర్ రుచి చూసిన బిల్ గేట్స్
Gold rate: మార్కెట్‌లోకి రష్యా బంగారం - పది గ్రాముల విలువ లక్షకు పడిపోయే చాన్స్ !
మార్కెట్‌లోకి రష్యా బంగారం - పది గ్రాముల విలువ లక్షకు పడిపోయే చాన్స్ !
Valentine Day: ఆటగాళ్లే - మిలాన్ వింటర్ గేమ్స్ లో కొండోమ్స్‌కు ఫుల్ డిమాండ్ !
ఆటగాళ్లే - మిలాన్ వింటర్ గేమ్స్ లో కొండోమ్స్‌కు ఫుల్ డిమాండ్ !
PM Kisan Nidhi Yojana : పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
JEE Main Result 2026: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల! 100 పర్సంటైంల్‌ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు విద్యార్థులే!
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల! 100 పర్సంటైంల్‌ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు విద్యార్థులే!
Trisha Reaction : హీరోయిన్ త్రిష ఫైర్ - సారీ చెప్పిన బీజేపీ లీడర్... విజయ్‌పై విమర్శల కాంట్రవర్సీకి చెక్ పడేనా!
హీరోయిన్ త్రిష ఫైర్ - సారీ చెప్పిన బీజేపీ లీడర్... విజయ్‌పై విమర్శల కాంట్రవర్సీకి చెక్ పడేనా!
Jana Sena Party Membership Registration: జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
జనసేనలో మూడు రకాల కార్యకర్తలు - సభ్యత్వ నమోదులో పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచన
Karnataka: ప్రియడితో వెళ్లిపోవాలని ప్లాన్.. భర్తను మర్డర్ చేయలేదు..తానే హత్యకు గురయింది..కానీ ట్విస్ట్ !
ప్రియడితో వెళ్లిపోవాలని ప్లాన్.. భర్తను మర్డర్ చేయలేదు..తానే హత్యకు గురయింది..కానీ ట్విస్ట్ !
Embed widget