Revanth Reddy: హార్వర్డ్ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని 'కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో' ప్రత్యేక విద్యా కోర్సును అభ్యసించబోతున్న భారత తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా Revanth Reddy నిలవనున్నారు.

Leadership Program at Harvard | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచంలోని నంబర్ వన్ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో “లీడర్‌షిప్: 21 సెంచరీ” అనే కోర్స్‌కు తెలంగాణ సీఎం హాజరుకాబోతున్నారు. దీంతో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు.
జనవరి 25 నుంచి 30 వరకు కోర్సు
ఈ కోర్స్ పేరు - “21వ శతాబ్దంకోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)”. ఈ కోర్స్ కోసం తెలంగాణ సీఎం ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు. 5 ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్‌మెంట్‌లు, హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాలనుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీనుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం విశేషాలు
ప్రైవేట్ ఐవి లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
మాసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉంది.
1607లో స్థాపించారు (418 సంవత్సరాల చరిత్ర).
గత 100 సంవత్సరాల్లో 75 సార్లు ప్రపంచంలో నంబర్ 1 విశ్వవిద్యాలయంగా నిలిచింది.
విశ్వవిద్యాలయంలో 14 కళాశాలలు ఉన్నాయి: బిజినెస్ (HBS), లా (HLS), మెడికల్, గవర్నమెంట్, థియాలజీ శాస్త్రాలకు విడివిడిగా కాలేజీలు
కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ విశేషాలు
1936లో స్థాపించారు.
1966లో అధ్యక్షుడు కెన్నెడీ పేరు పెట్టబడింది.
గ్రాడ్యుయేట్, మాస్టర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కోర్స్‌లు అందిస్తుంది.
2002: 52% పైగా మహిళా విద్యార్థులు.
2011: 75వ వార్షికోత్సవం / విశ్వవిద్యాలయం 375 సంవత్సరాలు.
2014: పూర్వ విద్యార్థులు, దాతల నుండి ½ ట్రిలియన్ డాలర్లు సేకరించింది.
2026: 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విద్యార్థులతో హార్వర్డ్‌లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులు చదివే కాలేజీలలో ఒకటిగా కెన్నెడీ స్కూల్ నిలుస్తోంది.






















