మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా టైటిల్ 'కదిరి'. ఈ టైటిల్‌ను వరుణ్ తేజ్ సక్సెస్ మీట్‌లో చిరంజీవి స్వయంగా లీక్ చేశారు.
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Mega 158 Titled Kadiri: వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన 158వ సినిమా టైటిల్ లీక్ చేశారు. 'కదిరి' అని చెప్పారు. మరి ఆ మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

- చిరంజీవి 158వ సినిమా టైటిల్ 'కదిరి' స్వయంగా లీక్ చేశారు.
- బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆగస్టు 22న విడుదల.
- ప్రియమణి సహా నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Chiranjeevi Leaks Mega 158th Movie Title: చిరు లీక్స్... ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ మరో మారు వైరల్ అవుతోంది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి. దానికి వేదిక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్. కథానాయకుడిగా తన 158వ సినిమా టైటిల్ లీక్ చేశారు చిరంజీవి.
'కదిరి'గా చిరంజీవి.. ఆగస్టు 22న టీజర్!
Kadiri Teaser Release On Aug 22nd: చిరంజీవి వీరాభిమానులలో దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) ఒకరు. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. హీరోగా అది చిరంజీవి 158వది. ఆ సినిమాకు 'కదిరి' అని టైటిల్ పెట్టారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read: Rukmini Vasanth Mollywood Debut - మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌లో లీక్స్ ఏమైనా అని అడిగినప్పుడు సంగీత దర్శకుడు తమన్ వద్దని చెప్పారు. అయితే టీజర్ మ్యూజిక్ అయ్యిందా? ఆ టీజర్ చివర 'కదిరి' అని టైటిల్ ఉంచారా? అని చిరంజీవి అగడటంతో అసలు టైటిల్ బయట పడింది. అదీ సంగతి.
Also Read: Kalki 2 - ప్రభాస్ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
#ChiruLeaks:#Mega158 as కదిరి…?#ChiruBobby #Chiranjeevi pic.twitter.com/mQxggm1BrS
— Filmy Focus (@FilmyFocus) August 11, 2026
చిరు సినిమాలో నలుగురు హీరోయిన్లు!
Kadiri Movie Heroine: చిరంజీవి 'కదిరి' సినిమాలో నలుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో 'ఛాంపియన్' ఫేమ్ అనశ్వర రాజన్ కూడా నటిస్తున్నారు. ఆమె చిరు మేనకోడలి పాత్ర పోషిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, లోకేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.
Also Read: Toxic Imax Release - టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Frequently Asked Questions
చిరంజీవి 158వ సినిమా టైటిల్ ఏమిటి?
'కదిరి' సినిమా దర్శకుడు ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు?
ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
'కదిరి' సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు ఎవరు?
ఈ సినిమాలో ప్రియమణి, రచితా రామ్, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రియమణి చిరంజీవి సరసన ప్రధాన కథానాయిక.
'కదిరి' సినిమా టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది?
చిరంజీవి నటిస్తున్న 'కదిరి' సినిమా టీజర్ ఆగస్టు 22న విడుదల కానుంది.
ట్రెండింగ్ వార్తలు





















