Zee Telugu Serial Gundamma Katha Today Episode: 'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!
Karthika Deepam Monitha in Gundamma Katha Serial: 'కార్తీక దీపం' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటి శోభా శెట్టి. ఇప్పుడు ఆవిడ జీ తెలుగు సీరియల్ 'గుండమ్మ కథ'లో నటించారు.

శోభా శెట్టి (Shobha Shetty) కన్నడ అమ్మాయి. అయితేనేం? 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అందులో మోనితగా అందరికీ పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయి మరో తెలుగు సీరియల్ (Zee Telugu Serials) చేస్తోంది. 'జీ తెలుగు'లో ప్రసారం అయ్యే 'గుండమ్మ కథ' (Gundamma Katha Serial)లో కనిపించనుంది.
గుండమ్మ కథలో శోభా శెట్టి... కానీ చిన్న ట్విస్ట్!
Shobha Shetty doing guest appearance in Gundamma Katha: జీ తెలుగు ఛానల్ సూపర్ హిట్ సీరియళ్లలో గుండమ్మ కథ ఒకటి. ఇప్పటికే 2044 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. సాధారణంగా కొత్త క్యారెక్టర్లు ఏవైనా సరే కొన్ని రోజులు కనబడతాయి. కానీ శోభా శెట్టి క్యారెక్టర్ అలా కాదు. చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే...
'గుండమ్మ కథ'లో శోభా శెట్టి అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. ఆవిడ చేసేది గెస్ట్ రోల్ మాత్రమే. అయితే, అది కూడా ఫుల్ ఫ్యాషన్ గురు అనేలా ఉంది. ఒక ఫ్యాషన్ షోకి అతిథిలా శోభా శెట్టి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి. ఆమె లుక్ అయితే మాత్రం చాలా బాగుంది.
సోమ నుంచి శని వారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 1:30 వరకు 'జీ తెలుగు'లో 'గుండమ్మ కథ' సీరియల్ ప్రసారం అవుతోంది. ఇందులో కన్నడ నటి పూజ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆవిడకు శోభా శెట్టి బాగా క్లోజ్. గతంలో వాళ్ళు ఇద్దరు కలసి ఒక రియాలిటీ షోలో సందడి చేశారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా
'కార్తీక దీపం' ఆ తర్వాత రియాలిటీ షోస్ చాలా చేసింది శోభా శెట్టి. అయితే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మోనితగానే ముద్ర పడింది. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అటువంటిది. మోనిత నెగిటివ్ షెడ్ రోల్ అయినా సరే... తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు శోభా శెట్టి. ఆ సీరియల్ తర్వాత 'బిగ్ బాస్' ఆమెకు మరింత పాపులారిటీ సాధించింది.
Also Read:కయాదు లోహర్ మాలీవుడ్ రొమాంటిక్ కామెడీ... రెండు ఓటీటీల్లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్
ఇప్పుడు టీవీ రియాలిటీ షోలు, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ మోనిత అలియాస్ శోభా శెట్టి బిజీ బిజీగా ఉన్నారు. కొత్త సీరియల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మరి? మరోవైపు ఆవిడకు హీరోయిన్ రోల్స్ కూడా కొంతమంది ఆఫర్స్ చేస్తున్నారని తెలిసింది. అయితే సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని శోభా శెట్టి భావిస్తున్నారట. ఆవిడ ఫ్యాన్స్ స్క్రీన్ మీద ఆవిడను ఎక్కువ టైమ్ చూడాలని కోరుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

