'కార్తీక దీపం' సీరియల్ డాక్టర్ మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి గుర్తున్నారుగా!  

ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేస్తున్న 'లేడీస్ అండ్ జెంటిల్ మన్' టీవీ షోకి శోభా శెట్టి వచ్చారు. 

'లేడీస్ అండ్ జెంటిల్ మన్'లో సరదాగా ఎవరెవరు ఏయే దొంగతనాలు చేశారని ప్రదీప్ అడిగారు. 

శోభా శెట్టి చాలా సీరియస్ గా తన తండ్రి చేసే చిలిపి దొంగతనాల గురించి చెప్పేశారు. 

తొలుత తాను ఎటువంటి దొంగతనాలు చేయలేదని శోభా శెట్టి చెప్పారు. అప్పుడు ప్రదీప్ ఇంకో ప్రశ్న వేశారు. 

'షూటింగుకు వెళ్ళినప్పుడు హోటల్ రూముల్లో షాంపూ డబ్బాలు, టవల్స్... చెప్పేసేయ్' అని శోభాను ప్రదీప్ అడిగారు. 

'అటువంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు. కానీ, మా నాన్న చేస్తారు' అని శోభా శెట్టి పేర్కొన్నారు. 

ప్రదీప్ సహా షోలో ఉన్న భాను శ్రీ, యస్మీ, స్నిగ్ధ, పూజ తదితరులు ఒక్కసారిగా నవ్వేశారు. 

శోభా శెట్టి (All Images Courtesy : Shobha Shetty Instagram)