నాలుగు పదుల వయసులోనూ ఈ విధమైన శరీరాకృతితో ఉండటం శ్రియకు మాత్రమే సాధ్యం ఏమో!? ఇప్పుడు శ్రియ వయసు ఎంత అనుకున్నారు? అక్షరాల 40 ఏళ్ళు. 'కబ్జా' సినిమాతో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నారు శ్రియ. ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా నటించిన 'కబ్జా'కు ఆర్. చంద్రు దర్శకత్వం వహించారు. 'కబ్జా' సినిమాలో మధుమతి పాత్రలో శ్రియ నటించారు. 'కబ్జా'లో శ్రియ మీద ప్రత్యేకంగా ఓ పాట తెరకెక్కించారు. 'నమామి నమామి...' అంటూ ఆ గీతం సాగింది. స్వతహాగా శ్రియ క్లాసికల్ డ్యాన్సర్. హీరోయిన్ కాకముందు సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నారు. క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో శ్రియ డ్యాన్సులు చేయడానికి పెద్దగా ఇబ్బంది పడినట్లు అనిపించదు. శ్రియా శరణ్(All Images Courtesy : Shriya Saran / Instagram)