అన్వేషించండి

Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం

Robots Join SLBC search operation | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల గల్లంతైన మిగిలిన 7 మంది కోసం రోబోలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ టీమ్ తో కలిసి రోబోలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

SLBC Tunnel Rescue Operation | నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్నటివరకు జీపీఆర్ పరికరాలు, స్నిఫర్ డాగ్స్, ఆపై కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగినా అంత ప్రయోజనం కనిపించలేదు. తాజాగా మంగళవారం నాడు రోబోలు రంగంలోకి దిగాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించేందుకు రోబోల ద్వారా అన్వేషిస్తున్నారు. 100 మందితో కూడిన రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. 

ఇటీవల రోబోల విషయం ప్రస్తావించిన రేవంత్ రెడ్డి

టన్నెల్ లోపల 8 మంది చిక్కుకోగా, ఇప్పటివరకూ ఒక్క మృతదేహం మాత్రమే వెలికి తీశారు. అది కూడా కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగిన రెండు, మూడు రోజులకు స్పాట్స్ గుర్తించాక.. అక్కడ తవ్వకాలు చేపడితే టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గా చేసిన గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. నేడు 18వ రోజు మిగతా ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పది రోజుల కిందటే సీఎం రేవంత్ రెడ్డి రోబోల వినియోగానికి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అందుకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన అనంతరం ఇటీవల అధికారులతో అన్నారు.

తెలంగాణలో సంచలనం రేపిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారు. మొత్తం 44 కిలోమీటర్ల పొడవు సొరంగం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రెండు దశాబ్దాలు పూర్తయినా 35 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. త్వరగా మిగతా పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. ఫిబ్రవరి 18న టన్నెల్ లో పనులు తిరిగి ప్రారంభం కాగా, 22వ తేదీన ఉదయం టన్నెల్ లోపల పైకప్పు కూలిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దోమలపెండ సమీపంలో టన్నెల్ పైకప్పు కూలింది.

నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఎప్పటికప్పడూ టన్నెల్ వద్ద పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్ మైనర్స్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, దక్షిణ మధ్య రైల్వే, కేరళ కెడావర్ డాగ్స్ స్క్వాడ్, తాజాగా రోబోలు సైతం రెస్క్యూ టీంలో చేరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 13 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తి కాగా, లోపల నుంచి నీళ్లు ఊట ఊరడంతో బురద పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. కెడావర్ డాగ్స్, రోబోల ద్వారా ఏమైనా డెత్ స్పాట్స్ గుర్తిస్తే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు జరిపి, ముక్కలు కాకుండా మృతదేహాలను టన్నెల్ నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వెలికితీసిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్ తరలించారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget