అన్వేషించండి
Ram Pothineni: రామ్ పోతినేని డ్యాన్స్ అంటే ఇష్టం... RAPO22 చిత్రీకరణలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఆ సెట్స్‌లో హీరో దర్శక నిర్మాతలను ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కలిశారు.

రామ్ పోతినేని డ్యాన్స్ అంటే ఇష్టం... RAPO22 చిత్రీకరణలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
1/5

రామ్ పోతినేని హీరోగా 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా రామ్ 22వ సినిమా కనుక #RAPO22 అంటున్నారు. ఇటీవల రాజమండ్రిలో రెండో షెడ్యూల్ మొదలైంది.
2/5

రాజమండ్రిలో జరుగుతున్న రామ్ సినిమా చిత్రీకరణకు ఏపీ కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. సుమారు గంటసేపు రామ్ పోతినేనితో ముచ్చటించారు.
3/5

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు దగ్గరలో గల కుమారదేవం గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్ పోతినేని డ్యాన్సులు తనకు ఇష్టమని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రబ్బరు స్ప్రింగ్ తరహాలో రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్నారు.
4/5

ఏపీలో మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చిత్రీకరణలు చేసిన సినిమాలు ఘన విజయాలు సాధించాయని, రామ్ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.
5/5

రాజమండ్రిలో రెండు వారాల క్రితం RAAPO22 రెండో షెడ్యూల్ మొదలైంది. అక్కడికి చిత్రీకరణకు వెళ్లిన రామ్ పోతినేనికి ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఘన స్వాగతం లభించింది. అరటి గెలలతో తయారు చేసిన భారీ గజమాలతో అభిమానులు వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్.
Published at : 22 Feb 2025 05:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion