అన్వేషించండి

Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు

Polavaram: పోలవరంలో చంద్రబాబు పర్యటించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు.

Chandrababu: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని  పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికి రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో  జమ చేశామన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే, 2027 నవంబర్‌ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. జరుగుతున్న పనులను సమీక్షించారు.  అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

పోలవరం రాజెక్టు కట్టాలని 1941లోనే ప్రణాళికలు సిద్ధమయ్యాయని..  అప్పుడు ప్రాజెక్టు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి .. 400 టీఎంసీలు వాడుకుంటే ఏపీని కరవు రహితం చేయవచ్చన్నారు.  విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు .. ప్రాజెక్టును చేయగల్గుతామనే ధీమాతో ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు.  ఏడు మండలాలు తెలంగాణాలో ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేది కాదన్నారు.  ఏడు మండలాలు ఏపీకి ఇవ్వడం ప్రాజెక్టుకు దోహదమైందన్నారు. 

2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును 73 శాతం పూర్తి చేశామని..  పోలవరం పై 82 సార్లు వర్చువల్ గా సమీక్షించానని తెలిపారు.  పోలవరం ఆలస్యమవుతుందని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని..  ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశామన్నారు.  వైసీపీ హయాంలో జరిగిన తప్పు...చరిత్ర క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జాతీయ ప్రాజెక్టు....ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.  గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షతో ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్నారు.  గతంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది కూడా ఎవరికీ తెలియదని..  కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు.  ఊహించని నష్టం జరిగింది...ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.  పీపీఏ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పినా పట్టించుకోలేదని..  ఒకసారి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 పోలవరం విషయంలో నిపుణుల కమిటీ పరిశీలించిందని..  దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  రాజకీయ కక్షతో రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టు పై కక్ష తీర్చుకున్నారని మండిపడ్డారు.  డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతోందని.. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 డిసెంబర్ కు పూర్తయ్యేలా ఉందన్నారు.  డిసెంబర్ 31 నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం.. - ఇతర పనులన్నీ డిసెంబర్ 26 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.  ఎడమవైపు అనుసంధానం జూన్ 26 నాటికి పూర్తి చేస్తామని.. కుడివైపు అనుసంధానాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు.  ఫిబ్రవరి 26 నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1 డ్యామ్ పూర్తి చేస్తాం .. 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 డ్యామ్ పూర్తి చేస్తామని ప్రకటించారు. 

అంతకుముందు ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు
మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు
Dhee Show Pandu: పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
Pawan Kalyan Telangana Controversy 2026: పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!
పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Embed widget